Kartikeya says he will bounce back again సారీ.. ఈ ఒక్కసారికి క్షమించరూ: కార్తీకేయ

I hope i ll be given another chance to prove myself kartikeya

ChaavuKaburuChallaga, basthi balaraju, karthikeya, apology, fans, geeta arts, allu aravind, allu arjun, Tollywood, movies, entertainment

Actor Kartikeya Gummakonda’s last film Chaavu Kaburu Challaga received mixed response from critics and audience alike. However, the actor received love for his portrayal of Basthi Balaraju, even if the character’s problematic tropes were pointed out.

సారీ.. ఈ ఒక్కసారికి క్షమించరూ: కార్తీకేయ

Posted: 03/29/2021 06:53 PM IST
I hope i ll be given another chance to prove myself kartikeya

ప్రేమతో మీ కార్తీక్‌ సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టిన యంగ్‌ హీరో కార్తికేయ ఆ సినిమా హిట్ కాకపోయినా పెద్దగా బాధపడలేదు. మంచి బ్రేక్ కోసం వేచి చూసిన ఆయనకు ఆర్ఎక్స్ 100 మర్చిపోలేని హిట్ ఇచ్చింది. అయితే ఇదే ఆయన తొలిచిత్రమని ఇప్పటికీ అనేక మంది అభిమానులు అనుకుంటుంటారు. కానీ ప్రేమతో కార్తీక్ చిత్రంతోనే ఆయన పరిచయమయ్యాడన్ని విషయం కూడా చాలా మందికి తెలియదు. అసలు ఈ సినిమా ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలీదు.

ఆర్‌ఎక్స్‌100 సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో కార్తీకేయ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. చిన్నపాటి స్టార్‌ అయిపోయాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ అవన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే ఈసారి గీతా ఆర్ట్స్‌ అనే పెద్ద బ్యానర్‌లో సినిమా చేస్తుండటంతో హిట్టు పడటం ఖాయం అని అంతా ఫిక్సయ్యారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ చావు కబురు చల్లగా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది. ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు తీరా సినిమా చూశాక ఉసూరుమంటూ నిట్టూరుస్తున్నాడు.

వారి నిరుత్సాహాన్ని పసిగట్టిన కార్తికేయ అభిమానులను క్షమించమని కోరుతూ ట్వీట్‌ చేశాడు. "చావు కబురు చల్లగా సినిమా నాలో కొత్త నటుడిని పరిచయం చేసింది. బస్తీ బాలరాజుగా ఎన్నో హృదయాలకు నన్ను దగ్గర చేసింది. ఈ సినిమా నచ్చని అందరూ చిన్న తప్పులున్నా క్షమించేసి ఇంకో అవకాశం ఇవ్వండి. తప్పకుండా దాన్ని సరిదిద్దుకుని మళ్లీ పుంజుకుంటా"నని కోరాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. దీనిపై ఆయన అభిమానులు స్పందిస్తూ కెరీర్‌లో ఇలాంటి ఒడిదుడుకులు సాధారణమేనని, త్వరలో తప్పకుండా హిట్‌ కొడుతావ్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ChaavuKaburuChallaga  basthi balaraju  karthikeya  apology  fans  geeta arts  allu aravind  allu arjun  Tollywood  

Other Articles