Vedam movie fame Nagaiah passes away క్యారెక్టర్ అర్టిస్టు వేదం నాగయ్య ఇకలేరు..

Tollywood charecter artist madasu nagaiah passed away

Vedam Nagaiah, Vedam Nagaiah no more, Vedam Nagaiah passed away, Vedam Nagaiah illness, charecter Artist Nagaiah, Dechavaram, Guntur District, corona Lockdown, Financial problems, KTR, Tollywood, Movies, Entertainment

Actor Madasu Nagaiah passed away at his residence in Dechavaram village in Guntur district due to illness. He received the Nandi Award for his acting in debut film Vedam. The actor played various roles in more than 30 Telugu films.

టాలీవుడ్‌లో‌ విషాదం: వేదం నటుడు నాగయ్య మృతి

Posted: 03/27/2021 05:20 PM IST
Tollywood charecter artist madasu nagaiah passed away

టాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. ‘వేదం’ సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప్ర‌ముఖ నటుడు నాగ‌య్య ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా దేసవరం పేటకు చెందిన నాగయ్య పోట్టకూటి కోసం హైదరాబాద్ కు రాగా, ఆయనను సినీకళామతల్లి అక్కున చేర్చుకుంది.

‘వేదం’ సినీ నిర్మాత ఆయనకు అవకాశం కల్పించడంతో ఆయన నిలదొక్కుకున్నారు. వేదంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తన నటన, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకులను ఆకట్టుకుని ఏకంగా 30 చిత్రాల్లో క్యారెక్టర్ అర్టిస్టుగా రాణించారు. దీంతో ఆయనకు తెలుగులో నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్‌ సార్‌, ఏ మాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్‌, విరంజితో పాటు పలు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. కాగా ఇటీవల ఆయన భార్య అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కొంత మనోవేదనకు గురయ్యారు.

ఆ తరువాత కరోనా మహమ్మారి విసిరిన లాక్ డౌన్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్లు జరగకపోవడం.. ఇక అప్పటికే ఆయన చేతిలోనూ అవకాశాలు లేకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందులకు గురైన నాగయ్య బతుకు బండి నడవటం కోసం ఫిల్మ్ నగర్ ప్రాంతంలోనే బిక్షాటన కూడా చేయాల్సివచ్చింది. ఆయన దీనస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆయనకు సాయం చేశారు. ఆ తరువాత మా ఆసోసియేషన్‌ అండగా నిలిచింది. అయినా అనారోగ్యం ముంచెత్తడంతో ఆయన తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles