RRR: Birthday Girl Alia Bhatt Enchants As Sita In First Look ’ఆర్ఆర్ఆర్’: ఆకట్టుకున్న రామరాజు ‘సీత’ ఫస్ట్ లుక్.!

Rrr alia bhatt s glimpse as sita in ss rajamouli s rrr has left fans curious

RRR, Alia Bhatt, Alia Bhatt first look, Alia Bhatt birthday, Junior NTR, Ram Charan, Ram Charan Tej, Tarak, Cherry, Mega Fans, Nandamuri fans, Ajay devgn, Shriya Saran, Samudrakhani, kumaram bhem, alluri sitarama raju, RRR release date, RRR Trailer, RRR Teaser, Alia bhat, Rajamuli, jakanna, Junior NTR family pic, Junior NTR sons, Abhay ram, bhargava ram, RRR, ntr, tollywood, movies, entertainment

Alia Bhatt gave her fans a birthday treat on Monday by sharing her first ever look from the forthcoming film RRR. We are smitten by Alia Bhatt's look in the SS Rajamouli-directed film. In the poster, Alia looks simply stunning, dressed in a green saree as she looks away from the camera.

’ఆర్ఆర్ఆర్’: ‘సీత’గా అలియాభట్ ఫస్ట్ లుక్ విడుదల.. అదుర్స్.!

Posted: 03/15/2021 11:38 AM IST
Rrr alia bhatt s glimpse as sita in ss rajamouli s rrr has left fans curious

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపోందిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ  స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్) నుంచి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. చిత్రం రిలీజ్ డేట్ లాక్ చేసిన నాటి నుంచి ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి అప్ డేట్స్ పై చిత్రబృందం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. ఇవాళ బాలీవుడ్ బామ అలియా భట్ జన్మదినాన్ని పురస్కరించుకుకుని అప్ డేట్ అందిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే వార్తను ఫ్యాన్స్ అందించారు చిత్రబృందం. దీంతో ఏలాంటి అప్ డేట్ లభిస్తుందా.? అంటూ అభిమానులు ఉదయం నుంచి అంతర్జాలానికి అతుక్కుపోయారు.

ఇక ఇవాళ అందుకు సంబంధించిన స్పెషల్ సర్ ప్రైజ్ ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. పాన్ ఇండియా చిత్రంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కీలక పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ మెరవనుందన్న విషయం తెలిసిందే. ఇటీవల మెరిస్ పుట్టినరోజు సందర్భంగా అమె ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఫిల్మ్ యూనిట్.. జెన్నీఫర్ పాత్రలో అమె అందంగా చూపించారు.  

ఇక తాజాగా అలియా భట్ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ అమెకు చిత్రబృందం అమె ఫస్ట్ లుక్ విడుదల చేసి అభిమానులతో పంచుకుంది. రామరాజు ప్రేయసిగా సీత పాత్రలో అమె లుక్ అదిరిపోయింది. అచ్చంగా పదహారణాల తెలుగు యువతిలా.. ఏదో అంశాన్ని తీక్షణంగా చూస్తున్నట్లుగా కనిపిస్తోందామె. ఉంగరాల జుట్టుతో వాలు జడతో మెడలో నల్లని దారినిక లాకెట్టు, బంగారు గొలుసు, జడలో కనకంబరాల పూలతో ముఖానికి అందాన్ని పంచే కుంకుమ తిలకం.. తలలో పాపిట బిల్ల.. బంగారు వర్ణం అంచుతో ముదురు పచ్చరంగు చీర.. అభిమానులను అకట్టుకుంటోంది.

ఇంత ముచ్చటగా కనిపిస్తున్న ఫస్ట్ లుక్ తో అభిమానులు నుంచి అలియాభట్ కు శుభాకాంక్షలు వెల్లివిరిసాయి. అంతేకాదు రామ్ చరణ్ సహా ఎన్టీఆర్ అటు మెగా అభిమానులతో పాటు ఇటు నందమూరి అభిమానులు, ఆలియాభట్ అభిమానులు, మరోవైపు జక్కన్న అభిమానులు అమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇలా ఆలియా భట్ కు తొలిసారి దక్షిణభారతావని నుంచి పెద్ద సంఖ్యలో బర్త్ డే విషెస్ వెల్లివిరుస్తున్నాయి. ఈ చిత్రంలో అజయ్ దేవ్ గణ్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తుండగా, చిత్రాన్ని డీవివి దానయ్య నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RRR  Alia Bhatt  first look  Ram Charan  Junior NTR  Mega Fans  Nandamuri Fans  RRR release date  SS Rajamouli  tollywood  

Other Articles

Today on Telugu Wishesh