Makers of Vakeel Saab unveil Kanti papa Lyrical Song ‘వకీల్ సాబ్’ నుంచి కంటిపాప లిరికల్ సాంగ్

Makers of vakeel saab unveil kanti papa lyrical song

vakeel saab, vakeel saab poster, pawan kalyan, Anjali, Nivetha Thomas, Ananya Nagalla, Sriram Venu, Dil Raju, Boney Kapoor, Tollywood, movies, entertainment

After hitting the bull’s eye with ‘Maguva Maguva’ and ‘Sathyameva Jayathe’, the makers of Pawan Kalyan’s upcoming film Vakeel Saab have unveiled the third song from the film. Titled as ‘Kanti Papa’, the soothing number comes during the flashback portions of the courtroom drama and it showcases the romantic equation between Pawan and Shruti Haasan.

పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ నుంచి కంటిపాప లిరికల్ సాంగ్

Posted: 03/17/2021 05:45 PM IST
Makers of vakeel saab unveil kanti papa lyrical song

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న 'వ‌కీల్ సాబ్' సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. గత ఏడాది అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నుంచి వరుసగా సినిమాకు చెందిన అప్ డేట్స్ ఇస్తూ వస్తున్న వకీల్ సాబ్ చిత్రబృందం తాజాగా ఓ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ చిత్రం నుంచి హీరో పవన్ కల్యాణ్, హీరోయిన్ శృతిహసన్ లపై చిత్రీకరించిన కంటిపాప కంటిపాప అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది.

ప్రముఖ గేయరచయిత రామజోగయ్యశాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించారు. దీపు, ఎస్ థమన్ కూడా జతకలిసారు. ఇతర పాత్రల్లో నివేదా థామస్, లావణ్య త్రిపాఠి, అనన్య నాగళ్ల, అంజలి కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి చెందిన రెండు పాటలను యూనిట్ విడుదల చేసింది. గత ఏడాది మార్చి 8న మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని మగువ.. మగువ అన్న పాటతో చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను అభిమానులతో పంచుకుంది. అయితే ఈ అప్ డేట్ తో మహిళా అభిమానుల్లో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

అయితే అదే ఒరవడిని కొనసాగించిన పవన్ కల్యాణ్ ఈ ఏడాది మార్చి 8న కూడా మ‌హిళా దినోత్స‌వాన్ని పురస్కరించుకుని ఓ ప్రత్యేక పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలక పాత్రల్లో ఉన్న ఈ పోస్టర్ అల‌రిస్తోంది. వారు ముగ్గురు త‌న‌ వెన‌క నిల‌బ‌డ‌గా మ‌హిళ‌ల‌ను కాపాడే అడ్వకేట్ ‌లా ప‌వ‌న్ క‌ల్యాణ్ కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఓ చేతిలో బేస్ బాల్ బ్యాట్, మ‌రో చేతిలో న్యాయ‌శాస్త్ర పుస్త‌కం ప‌ట్టుకుని సీరియ‌స్ లుక్ లో క‌నప‌డుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో.. బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles