టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ ఇళ్ల ఎదుట తమ రాబోవు చిత్రాల గురించి పోస్టర్లు పెట్టి వాటికి ప్రచారం కల్పించడం పరిపాటి. అయితే ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు బీజేపి నేతగా మోహన్ బాబు రానున్న ఎన్నికలలో బీజేపి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు.
దీంతో బల్దియాలో కొలువుదీరిన కొత్త అధికార యంత్రాంగం ఆయనపై ప్రతీకారం తీర్చుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకనే ఆయనకు బల్దియా ఎన్ఫోర్స్మెంట్ జరిమానా విధించిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎల్ఈడీ లైట్లతో కూడిన భారీ హోర్డింగ్‌ను ఇంటి బయట ఏర్పాటు చేసినందుకు గాను ఏకంగా లక్ష రూపాయల భారీ జరిమానా విధించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం ఆయనకు చలాన్ జారీ చేసింది. ముందస్తుగా ఎటువంటి రాత పూర్వక అనుమతి లేకుండా భారీ ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు ఈ జరిమానా విధిస్తున్నట్టు పేర్కొన్నారు.
మోహన్ బాబు, తమ కుటుంబ సభ్యులు నటించిన సినిమాల పోస్టర్లతో, ఎల్ఈడీ లైటులతో ఇంటి ముందు భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్ బిల్డింగ్ ఫ్రంటేజ్‌కు 15 శాతం దాటిపోయిందని, పైగా అనుమతి తీసుకోలేదు కాబట్టి జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు బల్దియా అధికారులు పేర్కొన్నారు. కాగా మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’, మంచు విష్ణు ‘మోసగాళ్లు’, మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాసి’ సినిమాలు చేస్తున్నారు. మంచు లక్ష్మీ ‘పిట్టకథలు’ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో నటించారు.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more