Official: Ram's Next Film Announced ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పిన హీరో రామ్

Official ram s 19th film details are here ram movie updates

Ram, N Lingusamy, Srinivasaa Chitturi, Krithi Shetty, Ram new movie, Ram next film, Ram upcoming projects, Ram upcoming movie, Ram movie news, Ram film updates, Ram latest news, Ram official, Ram 19th film, Ram next movie, tollywood, movies, Entertainment

Official: Ram's 19th film details are here: When the entire Tollywood turned a signing spree, young actor Ram is extra cautious and is waiting for the right project. He scored a roaring hit with Ismart Shankar and his recent offering RED ended up as a below-average grosser at the box-office. The actor is in the hunt for the right script and he rejected a series of films in the recent times.

ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పిన హీరో రామ్

Posted: 02/18/2021 09:29 PM IST
Official ram s 19th film details are here ram movie updates

వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ తన తదుపరి సినిమా విషయంలో ఫ్యాన్స్ మరో గుడ్ న్యూస్ చెప్పాడు. రామ్ అభిమానులు ఆయన నెక్ట్స్ ప్రాజెక్టు ఏమిటీ అని ఆసక్తిగా ఎధురుచూస్తున్న క్రమంలో తాజాగా వారికి అందుకు అనుగూణమైన అప్ డేట్ ఇచ్చాడు.

తన తాజా చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుస్వామితో చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. 'పందెం కోడి', 'ఆవారా' వంటి డబ్బింగ్ హిట్ చిత్రాల ద్వారా లింగుస్వామి తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితుడు. "నేను నటించే 19వ చిత్రానికి నా అభిమాన దర్శకులలో ఒకరైన లింగుస్వామి సర్ దర్శకత్వం వహిస్తారు. అలాగే, సినిమాల పట్ల ఎంతో ఫ్యాషన్ గల నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి గారితో పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను' అంటూ హీరో రామ్ ఈ రోజు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళంలో మంచి మార్కెట్ వున్న దర్శకుడు లింగుస్వామి తెలుగు హీరోతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. అది ఇప్పటికి రామ్ ద్వారా కార్యరూపం దాలుస్తోంది. ఇక ఈ చిత్రం కూడా హిట్ అయితే రామ్ కెరీర్ లో మరో హ్యాట్రిక్ హిట్ సాధించినట్టు అవుతుంది. ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి రామ్ సరసన జోడి కట్టబోతుందని కూడా టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  N Lingusamy  Srinivasaa Chitturi  Krithi Shetty  tollywood  movies  Entertainment  

Other Articles