Prabhas wraps up first schedule of Salaar ‘సలార్’ తొలి షెడ్యూల్ పూర్తి చేసిన ప్రభాస్

Prabhas wraps up first schedule of prashanth neel s salaar

Prabhas, Prabhas Saalar, Prabhas latest film, Baahubali Prabhas, Prabhas latest news, Latest films, Latest news, Prabhas age, prabhas salaar movie, Prashanth Neel, Prashanth Neel films, Salaar, Salaar first schedule, Salaar wrap up, salaar prabhas movie, Tollywood, movies, Entertainment

Baahubali actor Prabhas' upcoming magnum opus Saalar is one of the most anticipated films of the year.On Monday the makers announced that they have wrapped up the first schedule of the film.

‘సలార్’ తొలి షెడ్యూల్ పూర్తి చేసిన ప్రభాస్

Posted: 02/08/2021 09:59 PM IST
Prabhas wraps up first schedule of prashanth neel s salaar

ప్రభాస్‌ కథానాయకుడుగా కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తుంది. భారీ యాక్షన్‌ నేపథ్యంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు చిత్రీకరణ జనవరిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. గోదావరిఖని బొగ్గుగనిలో కొన్ని కీలక సన్నివేశాలు షూట్‌ చేశారు. తాజాగా తొలి షెడ్యూల్‌ పూర్తయిందని ఈ సినిమాకు పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్‌ భువన్‌ గౌడ సామాజిక  మాధ్యమాల వేదికగా తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పర్వతంలో ఒ మెట్టు అధిరోహించామని ప్రకటించారు.

ఇది చాలా అద్భుతమైన చిత్రమని, ఇందులో తన క్యారెక్టర్ చాలా హింసాత్మకంగా వుంటుందని, ఇలాంటి చిత్రాల్లో తాను ఇంతకు ముందు నటించలేదని ప్రభాస్ ఈ సందర్భంగా అన్నారు. ఇక ఇది పాన్ ఇండియా చిత్రమని.. ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తైయినా తాను రెండో షెడ్యూల్ కోసం ఆగలేకపోతున్నానని అన్నాడు రెబెల్ స్టార్. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ నటిస్తోంది. కన్నడ నటుడు మధూ గురుస్వామి ప్రతినాయకుడుగా కనిపించనున్నారు. ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్‌ లుక్‌ వాటిని రెట్టింపు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Salaar  Prashanth Neel  Shruthi Hassan  Bhuvan Gowda  Hombale Films  Tollywood  

Other Articles