FCUK Will Give Wholesome Entertainment: Jagapathi Babu దుర్గారావు కోరికను తీర్చిన జగపతి బాబు..

Jagapathi babu superb dance with tiktok durga rao

jagapathi babu dance with tik tok star, jagapathi babu dance with durga rao, Comedian Sunil, FCUK, FCUK Barasala Function, FCUK Pre Release Event, Jagapathi Babu, tiktok star durga rao, Tollywood, movies, Entertainment

FCUK (Father Chitti Uma Karthik) movie which has Jagapathi Babu in the lead role along with young pair Ram Kaarthik and Ammu Abhirami is bracing up for February 12th release.

దుర్గారావు కోరికను తీర్చిన జగపతి బాబు.. స్టార్స్ అంటే మీరే..

Posted: 02/08/2021 09:32 PM IST
Jagapathi babu superb dance with tiktok durga rao

జగపతిబాబు తన అభిమాని కోరిక తీర్చాడు. ఈ మధ్యాకాలంలో టీవీ షోలకు హాజరయ్యే సినీస్టార్స్ తో అక్కడి కంపటీటర్స్ ఓ స్టెప్పు వేయాలని వుంది అని అడగటం.. వేంటనే స్టార్స్ వెళ్లి డాన్స్ మూవ్ మెంట్స్ చేయడం సాధరణమైన విషయమే. అయితే ఏకంగా సినిమా ప్రి-రిలీజ్ ఈవెంట్లో ఈ మేరకు జగపతిబాబు తో డాన్స్ చేయాలని వుందని టిక్ టాక్ స్టార్ దుర్గారావ్ అన అభ్యర్థనను వెలిబుచ్చాడు. ఇది టీవీ షో కాదు.. బహిరంగ వేదిక.. అందులోనూ ఇంకా ఎంతో మంది సినిమా రంగానికి చెందిన ప్రముఖులు వున్నారు.

అయినా సరే.. వాటిన్నింటినీ పక్కన బెట్టి.. తన అభిమాని పిలవడంతోనే వేదికపైకి వెళ్లి ఆయనతో చిత్రంలోని పాటకు డాన్స్ మూవ్ మెంట్స్ చేశాడు జగపతి బాబు. అంతేకాదు తమ స్టార్ డమ్ వెనుక ఎంతో మంది శ్రమ దాగి వుంటుందని, అయితే మీ స్టార్ డమ్ వెనుక మీ శ్రమే వుంటుంది.. మీదే పూర్తి బాధ్యత.. మీరే నిజమైన స్టార్స్ అని కూడా కితాబిచ్చారు. నిజంగా ఇలాంటి సినిమా స్టార్లు.. ఏమాత్రం గర్వం లేకుండా వున్నారంటే అది మామూలు విషయం కాదు. ఇదంతా కార్తీక్, అభిరామి జంటగా నటించిన చిత్రం ఎఫ్‌.సి.యు.కె. చిత్రం బారసాల పంక్షన్ లో జరిగింది.

శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో దామోదర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో బారసాల పేరుతో ముందస్తు విడుదల వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలకు ప్రముఖ హాస్యనటుడు సునీల్ తోపాటు యూట్యూబ్ లో గుర్తింపు పొందిన వారంతా హాజరై సందడి చేశారు. ప్రధానంగా వేదికపై టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావుతో కలిసి జగపతిబాబు నృత్యం చేయడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఎఫ్‌.సి.యు.కె.సినిమా తొలి టికెట్‌ను నటుడు సునీల్ వెయ్యి రూపాయలకు కొనుగోలు చేయడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh