Naresh fight for justice, inside & outside the court క్రైమ్ థ్రిల్లర్ కు ‘నాంది’ పలుకిన అల్లరి నరేశ్

Mahesh babu unveils trailer of allari naresh and varalaxmi s naandhi

Allari Naresh Naandhi, Mahesh babu unveils Naandhi trailer, Naandhi Trailer intense drama, Mahesh babu, Allari Naresh, Naandhi, Varalaxmi Sarathkumar, Vijay Kanakamedala, Satish Vegesna, Sri Charan Pakala, Tollywood, movies, Entertainment

The trailer of Allari Naresh and Varalaxmi Sarathkumar's upcoming film, Naandhi, is out. The film, directed by Vijay Kanakamedala, went on floors in January 2020. However, the production got delayed, due to the outbreak of the novel coronavirus. Now, the film is nearing completion, and makers are all set to release it in theatres.

క్రైమ్ థ్రిల్లర్ కు ‘నాంది’ పలుకిన అల్లరి నరేశ్

Posted: 02/06/2021 02:14 PM IST
Mahesh babu unveils trailer of allari naresh and varalaxmi s naandhi

కామెడీ కింగ్ రాజేంద్రప్రసాద్ వారసత్వాన్ని అందుకుని కామెడీ చిత్రాలతో రాణిస్తూ.. మధ్యలో గమ్యం, మహర్షి వంటి చిత్రాల్లో సీరియస్ క్యారెక్టర్లను కూడా పోషించి తనలోని హాస్యనటుడ్నే కాదు.. నటుడ్ని కూడా చూపించిన అల్ల‌రి న‌రేశ్.. తాజాగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో రూపోందుతున్న ‘నాంది’లోనూ తన మార్కు నటనను అవిష్కరిస్తున్నారు. నాందిలో ఆయన అండర్ ట్రయిల్ ఖైదీగా.. ప్రతీకారం తీర్చుకునే హీరోగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇవాళ విడుదల కాగా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన 'నాంది' చిత్రం సినిమా ట్రైల‌ర్ ను సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో ఇవాళ విడుద‌ల చేశాడు. ఇందులో అల్లరి న‌రేశ్ చెబుతోన్న డైలాగులు ఆకట్టుకునేలా వున్నాయి. న్యాయం కోసం ఆయన ఇటు న్యాయస్థానం లోపల.. ఆటు న్యాయస్థానం బయట పోరాటం చేసే వ్యక్తిగా కనిపిస్తున్నారు. చేయ‌ని నేరానికి జైలు శిక్ష అనుభ‌వించే పాత్ర‌లో ఆయ‌న ఈ సినిమాలో న‌టించిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, ప్రియదర్శి, హరీశ్‌‌.. తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

నిమిషం 52 సెకనుల నిడివితో ఈ ట్రైల‌ర్ ఉంది. అంద‌రూ త‌న‌ జీవితం ఇక్క‌డితో అయిపోయింది అనుకుంటున్నారని, అయితే, ఇప్పుడే మొద‌లైందని అల్లరి నరేశ్ చెప్పే డైలాగు అల‌రిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, హరీశ్‌ ఉత్తమన్‌, ప్రవీన్‌, ప్రియదర్శి, దేవీ ప్రసాద్‌, వినయ్‌ వర్మ కీలక పాత్రల్లో న‌టించారు. ఈ సినిమాను ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న నిర్మిస్తుండ‌గా, శ్రీచరణ్‌ పాకల సంగీతం అందించారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు కూడా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఈ నెల‌ 19న విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles