Maruti counters lady scribe on Anushka baby bump అనుష్క పోస్ట్.. మారుతి ధిమ్మదిరిగే కౌంటర్

Maruthi is miffed with comments on anushka sharma flaunting her baby bump

Virat Kohli, Anushka Sharma, virushka, anushka baby bump, Director Maruti, Social Media, Lady Journalist, Counter, Motherhood, Bollywood, Entertainment, Telugu movies, Hindi movies, movies, Tollywood

Director Maruthi has found a journalist's comments on Anushka Sharma flaunting her baby bump problematic. Reacting to the Lady journalist tweet, the 'Prati Roju Pandage' director gave a sharp rebuttal. 'Disgraceful comments. That too from a lady journalist. Motherhood is a bigger joy than being the queen of England,' he wrote

అనుష్క పోస్ట్.. మారుతి ధిమ్మదిరిగే కౌంటర్

Posted: 09/15/2020 03:47 AM IST
Maruthi is miffed with comments on anushka sharma flaunting her baby bump

బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీల జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుతం తల్లికాబోతున్న అనుష్క శర్మ ఆనందంగా తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న విషయం కూడా తెలిసిందే. తన ఆనందాన్ని అందరికీ తెలియచేస్తూ తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ చూసి అభిమానులు ఎంతో సంతోషించారు. అమె పోస్టును షేర్ చేసుకుంటూ, లైక్ చేస్తూ అభిమానులు పంచుకున్నారు. అంతేకాదు ఇదే పోస్టును విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సైతం పంచుకున్నారు. అయితే ఓ మహిళా జర్నలిస్ట్‌ మాత్రం అనుష్క పోస్టుపై వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు.

విరాట్ కోహ్లీ అమెను తల్లిని మాత్రమే చేశాడని, ఇంగ్లాండ్ కు రాణిని చేయలేదన్న అర్థం వచ్చేట్టుగా వ్యాఖ్యలు చేసింది. ‘అనుష్క, ఆయన (విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ) మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశారు. ఇంగ్లాండ్ కి మహారాణిని చేయలేదు. మరీ అంత సంబరపడకండి’ అంటూ జర్నలిస్ట్‌ ట్వీట్ చేశారు. దీనిపై కూడా అమె అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు బుదలిచ్చారు. అయితే మహిళా జర్నలిస్టు చేసిన కామెంట్లపై దర్శకుడు మారుతి మాత్రం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఒక మహిళా జర్నలిస్టుగా వుంటూ తల్లి కావడాన్ని చులకనగా, ఆ సంతోషాన్ని తేలిగ్గా కోట్టిపారేయడం సమంజసం కాదని హితవు పలికారు.

ఒక రాజ్యానికి రాణిగా ఉండటం కంటే ఓ బిడ్డకి తల్లిగా ఉండడంలోనే మహిళకు ఎంతో సంతోషం ఉందని ఆయన అన్నారు. ‘ఒక మహిళా జర్నలిస్ట్‌ అయిన మీరు ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం విచారంగా ఉంది. ఇంగ్లాండ్‌కు రాణిగా ఉండటం కంటే మాతృత్వపు ప్రేమను ఆస్వాదించడం ఓ మహిళకు ఎంతో సంతోషాన్నిస్తుంది. నిజం చెప్పాలంటే.. ప్రతి మహిళా ఓ మహారాణినే. ప్రతి సంతోషకరమైన నివాసం ఓ రాజ్యమే. అనుష్క సెలబ్రిటీ కావడానికంటే ముందు ఓ సాధారణమైన స్త్రీ. తల్లికాబోతున్న క్షణాలను ఆసాంతం ఆనందించే హక్కు ఆమెకు ఉంది’ అని మారుతి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles