Actor Shiva balaji complaints on Online Classes in HRC హెచ్ఆర్సీని ఆశ్రయించిన శివబాలజీ.. పాఠశాలపై పిర్యాదు..

Actor siva balaji files complaint against school for barring his kids from online classes

Shiva Balaji, Swapna Madhuri, Private School, School Fee hike, Online Classes, Human Rights Commission, Mount Litera Zee school, Manikonda, Tollywood, Telangana

Actor-Bigg Boss Telugu season 1 winner Siva Balaji and wife Swapna Madhuri, reportedly filed a complaint against Mount Litera Zee school, Manikonda, Hyderabad, in the Human Rights Commission (HRC) for allegedly disconnecting their children's online classes without prior notice.

హెచ్ఆర్సీని ఆశ్రయించిన శివబాలజీ.. పాఠశాలపై పిర్యాదు..

Posted: 09/15/2020 03:30 AM IST
Actor siva balaji files complaint against school for barring his kids from online classes

మహమ్మారి క‌రోనా విజృంభన కారణంగా పాఠశాలలు, విద్యా సంస్థల తరగతుల నిర్వహణపై అంక్షలు కోనసాగుతున్నాయి. అయితే విలువైన విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోకుండా వారికి ఆన్ లైన్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నాయి పాఠశాల యాజమాన్యాలు, ఇక పాఠశాలలు డిజిటల్ తరగతులను ప్రారంభించినా.. కరోనా నేపథ్యంలో ఏ పాఠశాల కూడా ఫిజులను పెంచరాదని, డోనేషన్లు తీసుకోరాదని, అయితే గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఫీజులను తీసుకోవాలని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. అయినా తమకేమీ పట్టనట్టు వ్యవహరించిన ఓ పాఠశాల వ్యవహారం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది, చ

చాలని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆయా పాఠశాలు, కాళాశాలలు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు ప్రారంభించాయి. అయితే, పలు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బులను వసూల్ చేస్తున్నాయి. తాజాగా సినీ నటుడు శివ బాలజీకి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్(హెచ్ఆర్‌సీ)లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శివబాలాజీ మీడియాతో మాట్లాడుతూ ‘మౌంట్ లిటేరా జీ స్కూల్’ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్ర‌భుత్వ ఆదేశాల‌ను కూడా ప‌ట్టించుకోకుండా అధిక మొత్తంలో డ‌బ్బు వ‌సూళ్లు చేస్తున్నారని అరోపించారు.

అనుమానం రాకుండా ఉండేందుకు అన‌వ‌స‌రంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎందుక‌ని ప్ర‌శ్నించినందుకు తన పిల్ల‌లు ఆన్ లైన్ క్లాసులు వినకుండా ఐడీల‌ను బ్లాక్ చేసింది. దీనిపై యాజ‌మాన్యాన్ని హెచ్చరిస్తే.. కేసులు పెడతామని బెదిరిస్తున్నార‌ు. ఇది తన ఒక్క‌డి ప‌రిస్థితి కాదు.. తనలా చాలామంది ఇబ్బందులకు గురవుతున్నార‌ని పేర్కొన్నారు. దీంతో తన పిల్లలకు న్యాయం చేయాల్సిందిగా ఆయన హెచ్ఆర్సీలో లో ఫిర్యాదు చేశానన్నారు. ఆ స్కూలు యాజమాన్యం బలవంతంగా ఫీజులను వసూలు చేస్తోందని, ప్రభుత్వ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles