బాలీవుడ్ టెర్రర్ సృష్టించి డ్రగ్స్ కేసులో మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నవారిని మానసిక రోగులుగా అభివర్ణించి వదిలి వేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత అటు శాండిల్ వుడ్ లోనూ ప్రకంపనలు రాజేస్తోంది. ఇక హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ లోనూ డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖ నటీనటులు, నిర్మాత పేర్లు వెలుగుచూస్తున్నాయి. హీరో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ఇచ్చిన వాంగ్మూలం మేరకు పలువురు సినీ తారలకు నోటీసులు ఇచ్చేందుకు ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు సన్నద్ధం అవుతున్నారు. వీరిలో పలువురు పెద్ద తారలు కూడా ఉండటం గమనార్హం.
యావత్ భారత దేశం సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటీమణి దీపికా పదుకునే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, దక్షిణాది తార రకుల్ ప్రీత్ సింగ్ లతో పాటు డిజైనర్ సిమోన్, దీపిక మేనేజింగ్ ఏజన్సీ ప్రతినిధి కరిష్మా తదితరుల పేర్లు ఉన్నాయి. వీరితో పాటు పలు ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన నిర్మాత మధు మంటేన సహా గత ఏడాది ప్రముఖ నిర్మాత కరన్ జోహార్ ఇచ్చిన విందుపై కూడా ఇప్పుడు ఎన్సీబికి సమాచారం అందింది. దీంతో ఆయన ఇచ్చిన విందులోనూ డ్రగ్స్ వినియోగం జరిగిందన్న అభియోగాల నేపథ్యంలో ఆ పార్టీపై కూడా నీలినీడలు అలుముకున్నాయి. ఇక ఈ విషయంలో సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోడీ సహా అతని టాలెంట్ మేనేజర్ జయ సహాలను కూడా ఎన్సీబి విచారించింది.
ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్ హోత్రా, వీరికి ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద సమన్లు పంపి, విచారించనున్నామని తెలియజేశారు. కాగా, ఈ కేసు విచారణలో భాగంగా ఓ నిందితుడిని విచారిస్తున్న సమయంలో అతని చాటింగ్ గ్రూప్ లో 'డీకే' అన్న అక్షరాలు కనిపించడం, డీ అంటే దీపిక అని, కే అంటే క్వాన్ టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజన్సీ ప్రతినిధి కరిష్మా అని అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇక ఈ కేసులో అమృతసర్, పాకిస్థాన్ లింకులు కూడా ఉన్నాయని భావిస్తున్న ఎన్సీబీ అధికారులు, మరింత లోతుగా కేసును విచారించాలని నిర్ణయించారు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | ప్రముఖ హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అల్లరి రవి బాబు, రవి ప్రకాష్, సూర్నారాయణ... Read more
Feb 27 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన హిట్ టాక్ ను సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.8 కోట్ట బడ్జెట్ తో రూపోందించాలని భావించిన ఈ చిత్రం ఏకంగా రూ.22... Read more
Feb 27 | రీల్ లైప్ లో ప్రేమ, పెళ్లి అంటూ ప్రతీ చిత్రంలో పరుగులు తీసి.. రోమాంటిక్ హీరోలా తెలుగు ప్రేక్షకులు హృదయాలను కొల్లగొట్టిన హీరో నితిన్.. రియల్ లైఫ్ లోనూ తన బాల్య స్నేహితురాలినే పెళ్లి... Read more
Feb 27 | నవ్వుల కిరీటీ రాజేంద్రప్రసాద్, యువ నటుడు శ్రీ విష్ణు కలసి నటిస్తున్న క్రైమ్ ధ్రిల్లర్ ‘గాలి సంపత్’ చిత్రం దర్శకుడు అనీష్ కృష్ణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా ట్రైలర్... Read more
Feb 27 | ఏంజెల్ ఆర్నాగా ప్రతిరోజు పండగే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి మార్కులు వేసుకున్న అందాల కథానాయిక రాశిఖన్నా తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రోమాన్స్ చేస్తోందన్న వార్త ఇప్పుడు హాట్... Read more