Anuradha Paudwal's son Aditya Paudwal passes away గాయని అనురాధ పౌడ్వాల్ తనయుడి మృతి

Singer anuradha paudwals son aditya paudwal dies at 35 battled kidney ailment

Aditya Paudwal, Anuradha Paudwal, Demise, Kidney Failure, Shankar Mahadevan, Bollywood

Singer Anuradha Paudwal's son Aditya Paudwal has died. He was 35 years old. Aditya was a music arranger and producer. Aditya was suffering from kidney ailments for a while. Singer and music producer Shankar Mahadevan was heartbroken at Aditya’s death.

గాయని అనురాధ పౌడ్వాల్ తనయుడు ఆదిత్య కన్నుమూత

Posted: 09/13/2020 07:55 PM IST
Singer anuradha paudwals son aditya paudwal dies at 35 battled kidney ailment

బాలీవుడ్ సీనియర్ గాయని అనురాధ పౌడ్వాల్ తనయుడు ఆదిత్య పౌడ్వాల్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆదిత్య పౌడ్వాల్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆదిత్య పౌడ్వాల్ మరణించిన విషయాన్ని స్టార్ సింగర్ శంకర్ మహదేవన్ వెల్లడించారు. శంకర్ మహదేవన్ తో కలిసి ఆదిత్య పౌడ్వాల్ అనేక మ్యూజికల్ ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఇది తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే వార్త అని, తమ ప్రియతమ ఆదిత్య పౌడ్వాల్ ఇకలేరని శంకర్ మహదేవన్ సోషల్ మీడియాలో వెల్లడించారు.

ఆదిత్య ఓ అద్భుతమైన సంగీతకారుడు అని, హాస్యప్రియుడైన ఆదిత్య మంచి మనిషి అని కొనియాడారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, ఆదిత్య ఎంతో ఉత్సాహవంతుడైన వ్యక్తి అని, 35 ఏళ్ల వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడని వివరించారు. వాస్తవానికి ఆదిత్య చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని శంకర్ మహదేవన్ వెల్లడించారు. అతడికి హైపర్ టెన్షన్, ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఉండేవని, చివరికి కిడ్నీలు ఫెయిల్ కావడంతో మరణం సంభవించిందని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aditya Paudwal  Anuradha Paudwal  Demise  Kidney Failure  Shankar Mahadevan  Bollywood  

Other Articles