Samantha shares heart touching video on twitter మూగజీవాల ప్రేమకథను ఫ్యాన్స్ తో పంచుకున్న సామ్

Samantha akkineni shares heart touching video on twitter

Samantha akkineni, Samantha heart touching video, samantha akkineni heart touching video, samantha akkineni twitter, cow and ass, samantha twitter, cow and ass video, fans, movies, entertainment, tollywood

South Indian top heroine Samantha akkineni shares heart touching video of a cow and its lover ass on twitter, which made the owner to change his decision and reunited the cow and ass.

హార్ట్ టచ్చింగ్ వీడియోను ఫ్యాన్స్ తో పంచుకున్న సామ్

Posted: 09/13/2020 07:38 PM IST
Samantha akkineni shares heart touching video on twitter

ఓ ఆవును కొనుక్కున్న వ్య‌క్తి దాన్ని వాహ‌నంలో అక్క‌డి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్తుండ‌గా దాని వెన‌కాలే ఎద్దు ప‌రుగులు తీసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. దీంతో భార‌త్ లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న  గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా తెలిసింది. ఇటీవ‌ల ఓ రైతు త‌న ఆవును అమ్మేయ‌గా దాన్ని ఓ వాహ‌నంలో తీసుకెళ్లారు. అయితే, ఆ ఆవును వాహ‌నంలో ఎక్కించిన వెంట‌నే ఎద్దు కంగారు ప‌డిపోయింది. దాన్ని వ‌దిలేయాల‌ని వేడుకుంటున్న‌ట్లు అటూ ఇటూ తిరిగింది. దీంతో వీధిలోని వారంద‌రూ ఆశ్చ‌ర్యంతో చూస్తూ ఉండిపోయారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను త‌మ స్మార్ట్ ఫోన్ల‌లో తీశారు. అయితే, చివ‌ర‌కు ఆ ఆవును వాహ‌నంలో తీసుకెళ్లిపోయారు. చాలా దూరం వ‌ర‌కు ఆ వాహ‌నం వెన‌కాలే ఎద్దు ప‌రుగులు తీసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇది వైర‌ల్ కావ‌డంతో ల‌క్ష‌లాది మంది దీనిపై స్పందించారు. దీంతో చివ‌ర‌కు వారి విజ్ఞ‌ప్తులు ఆ ఆవును కొన్న వ్య‌క్తుల వ‌ర‌కు వెళ్లాయి. దీంతో ఆ రెండింటినీ మ‌ళ్లీ క‌లిపి, పూజ‌లు చేశారు. మనసులను కదిలించే ఈ వీడియోను దేశంలోని ప్ర‌ముఖులు ట్వీట్ చేస్తున్నారు. హీరోయిన్ స‌మంత కూడా ల‌వ్  సింబ‌ల్ పోస్ట్ చేసి, ఈ వీడియోను షేర్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles