Prakash Raj trolls Kangana Ranaut by Meme 'మీరు లక్ష్మీబాయిగా ఫీలయితే.. మరీ..': ప్రకాష్ రాజ్ కౌంటర్

Prakash raj takes a dig at kangana ranaut by sharing a meme

Prakash Raj Meme, Kangana Ranaut, Brihanmumbai Municipal Corporation, Kangana office, Kangana office demolition, Kangana Ranaut Twitter, Prakash Raj Twitter

Prakash Raj has been using Twitter to express his various political and social opinions, in his recent tweet, he took a sly dig at Kangana. His tweet comes in the wake of the Brihanmumbai Municipal Corporation (BMC) demolition action at Kangana's office building in Bandra.

‘‘మీరు లక్ష్మీబాయిగా ఫీలయితే.. మరీ..’’: ప్రకాష్ రాజ్ కౌంటర్

Posted: 09/13/2020 08:16 PM IST
Prakash raj takes a dig at kangana ranaut by sharing a meme

మహారాష్ట్రలోని మహాఆఘాడీ ప్రభుత్వంపై విమర్శలకు చేస్తూ.. ఏకంగా శివసేన పెద్దలతో ఢీ కొడుతూ చివరాఖరున కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కూడా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసి.. తనకంటూ వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్.. తన కార్యాలయాన్ని కూడా కూల్చుకునే స్థితి తెచ్చుకున్నారన్న విషయాలు తెలిసినవే. అద్దాల మేడలో వున్నవారు వివాదాలకు తెరలేపితే కూలేది తమ మేడ అన్న నానుడి నిజం తెలియని నటి దూకుడుగా వెళ్లి మరీ తన కార్యాలయం మీదకు తెచ్చుకున్నారన్న వారూ లేకపోలేదు.

అయితే తాజాగా అమెపై తాజాగా సినీనటుడు ప్రకాశ్ రాజ్ చురకలంటిచేలా చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది, జస్ట్ ఆక్కింగ్ అన్న పేరుతో అయన రాజకీయ, ప్రజా సమస్యలపై నిత్యం పలు ప్రశ్నలను సంధిస్తుంటారు. కాగా తాజాగా ఆయన చేసిన ట్వీట్ మాత్రం తన సినీరంగానికి చెందిన కంగనాపై వ్యంగంగా ప్రశ్నించారు. రాణి లక్ష్మీభాయి శౌర్యాన్ని, త్యాగాలను తాను సినిమా ద్వారా చూపించానంటూ, నిజ‌జీవితంలోనూ ఎవరికీ త‌ల వంచ‌నంటూ ఇటీవ‌ల కంగ‌నా ర‌నౌత్ ట్వీట్ చేసింది. అయితే దీనిపై ఆయన అమెను టార్గెట్ చేశారు.

"ఒక్క సినిమాతో కంగ‌నా ర‌నౌత్ త‌న‌ను తాను రాణి ల‌క్ష్మీబాయితో పోల్చుకుంటే మ‌రి ప‌ద్మావ‌తిగా న‌టించిన దీపికా ప‌దుకుణె, అక్బ‌ర్ గా న‌టించిన హృతిక్ రోష‌న్, అశోక‌గా న‌టించిన షారుక్, భ‌గ‌త్ సింగ్ గా న‌టించిన అజ‌య్, మంగ‌ళ్ పాండేగా న‌టించిన ఆమిర్ ఖాన్, మోదీగా న‌టించిన వివేక్ ను కూడా ఆ గొప్పవారితో పోల్చొచ్చు" అని ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేశారు. కాగా, ఇటీవ‌ల కంగనా ర‌నౌత్ శివ‌సేన నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం, ముంబైకి వెళ్ల‌డం, డ్ర‌గ్స్ కేసులో ఆమె పేరు విన‌ప‌డుతుండ‌డం వంటి ఘ‌ట‌న‌లు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. ఆమెకు బీజేపీ మ‌ద్ద‌తు ఉంద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prakash Raj  Kangana Ranaut  Brihanmumbai Municipal Corporation  

Other Articles