Actress Shakeela Video Byte From Hospital ఆసుపత్రిలో షకీలా.. అవకాశం సద్వినియోగం..

Shakilas ladies not allowed movie will be released today online www ladiesnotallowed com

Actress Shakeela, Hospital, cinema promotion, video message, minor health issues, www.Ladiesnotallowed.Com, Sai Ram Dasari, Ramesh Kavali, Vikrant Reddy, tollywood, movies, entertainment

Ladies Not Allowed is an adult comedy-horror film directed by Sai Ram Dasari and presented by actress Shakila. Ramesh Kavali is building. Vikrant Reddy is the co-producer. This full-fledged comedy film is releasing today online on www.Ladiesnotallowed.Com website.

ఆసుపత్రిలో షకీలా.. అవకాశం సద్వినియోగం..

Posted: 07/21/2020 10:36 PM IST
Shakilas ladies not allowed movie will be released today online www ladiesnotallowed com

అడల్ట్ మూవీస్ తో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసిన అలనాటి శృంగార తార షకీలా అనారోగ్య కారణంగా ఆసుపత్రికి వెళ్లారు. అయితే హాస్పటల్ నుంచే ఆమె అభిమానులకు రిక్వెస్ట్ చేస్తూ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్క్ కట్టుకుని ఆవేశ పడుతూ షకీలా ఈ వీడియోను విడుదల చేయడంతో ఆమెకు ఏమైందంటూ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పటల్‌కి వెళ్లిన షకీలా అక్కడ నుంచే తన ‘లేడీస్ నాట్ అలౌడ్’ (Ladies Not Allowed) సినిమాను ప్రమోట్ చేసుకున్నారు.

షకీలా నటిస్తూ నిర్మించిన అడల్ట్ హారర్-కామెడీ జోనర్ కు చెందిన చిత్రం Ladies Not Allowed (లేడీస్ నాట్ అలౌడ్) ఈ రోజు రాత్రి 8 గంటలకు ఆన్ లైన్ లో విడుదల కానుండటంతో ఈ వీడియోను షేర్ చేశారు షకీలా. ఈరోజు జూలై 20.. రాత్రి 8 గంటలకు ‘లేడీస్ నాట్ అలౌడ్’ సినిమా రిలీజ్ అవుతుంది. ఈరోజు ఉదయం నుంచి ప్రమోషన్స్ చేయాలని అనుకున్నా.. కాని హెల్త్ ఇష్యూస్ రావడంతో హాస్పటల్‌కి రావాల్సి వచ్చింది. మీరు తప్పకుండా ఈ సినిమాను చూస్తారని ఆశిస్తున్నాను’ అంటూ వీడియో వదిలింది షకీలా.

ఈ చిత్రానికి సాయి రామ్ దాసరి దర్శకత్వం వహించగా.. కావలి రమేష్ , విక్రాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ సినిమా రెండేళ్ల క్రితమే పూర్తైనా సెన్సార్ వాళ్లు సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఆవేదన చెందింది షకీలా. తన సేవింగ్స్ మొత్తం ఈ సినిమాపై పెడితే సెన్సార్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. చివరికి సినిమా విడుదలౌతుందన్న నమ్మకంతో అప్పులు కూడా చేశానన్నారు షకీలా. అయితే Ladies Not Allowed సినిమా విడుదలకు మరింత ఆలస్యం అవ్వడంతో అప్పుల వాళ్లు వేధిస్తున్నారని వాపోయింది షకీలా. ఒకవైపు లాక్ డౌన్ రావడంతో చాలా ఒత్తిడిలో ఉన్నానని.. ఈ సినిమా విడుదలకు డిజిటలైజ్ ఒక్కటే మార్గం అని ఆన్ లైన్‌లో విడుదల చేస్తున్నానని.. WWW.LadiesNotAllowed.Comలో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని.. రూ.50 చెల్లించి అందరూ చూస్తే.. ప్రస్తుతానికి బతికిపోతా.. నేను తరువాత సినిమా చేయాలా వద్దా అనేది ఈ సినిమా డిసైడ్ చేస్తుంది’ అంటూ ఎమోషనల్ వీడియో విడుదల చేసింది షకీలా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles