Gopichand to go to sets with director maruthi కమేడియన్ గా మారనున్న మాచోస్టార్ గోపిచంద్

Macho star gopichand to go to sets with director maruthi

Gopichand, Tamannaah, Seetimaarr Movie, Gopichand, gopichand next with director maruthi, Director Maruthi, sampath nani, tollywood, movies, entertainment

With the ongoing movie seetimaar the Macho star Gopichand is busy, but taking few time during the lockdown the machostar has spent some liesure time with director maruti for listening story. Now after seetimaar Gopichand is going to sets with maruti

కమేడియన్ గా మారనున్న మాచోస్టార్ గోపిచంద్.. డైరెక్ట్ ఎవరంటే..

Posted: 07/21/2020 10:47 PM IST
Macho star gopichand to go to sets with director maruthi

టాలీవుడ్‌లో కామెడీ ప్రధానంగా ఫ్యామిలీ డ్రామాలను తెరకెక్కించే కొద్ది మంది దర్శకుల్లో మారుతి ఒకరు. ‘ఈ రోజుల్లో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మారుతి.. కిందటేడాది వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా వరకు డీసెంట్ హిట్స్ అందుకున్నారు. ‘కొత్త జంట’, ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ సినిమాలు మారుతి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ఎక్కడా కామెడీకి లోటు లేకుండా కథను నడిపించడంలో మారుతి దిట్ట. ‘ప్రతిరోజూ పండగే’ తరవాత మారుతి మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నారు.

ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న తాజా సమాచారం ప్రకారం మాచో హీరో గోపీచంద్‌‌ను ఇటీవల మారుతి కలిసి ఒక కథ చెప్పారు. ఈ కథ గోపీచంద్‌కు బాగా నచ్చేసిందని, ఆయన వెంటనే పచ్చజెండా ఊపేశారని టాక్. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనుందని అంటున్నారు. ఆ ప్రముఖ సంస్థ జీఏ2 అని కొంత మంది మాట. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. అంతా అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాది చివరలో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఈ సినిమా ప్రారంభం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే, గోపీచంద్ ప్రస్తుతం తన సినిమా ‘సీటీమార్’ విడుదల కోసం వేచి చూస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్ కారణంగా విడుదల ఆలస్యమైంది. ఈ సినిమాలో తమన్నా, దిగంగన సూర్యవంశి, రెహమాన్, ప్రదీప్ రావత్, దేవ్ గిల్, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, అజయ్, జయప్రకాష్, ప్రీతి అస్రాని ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘గౌతమ్ నంద’ తరవాత గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  Tamannaah  Seetimaarr Movie  Gopichand  Director Maruthi  sampath nani  tollywood  

Other Articles

  • Vice president ap cm naidu condole death of film actor ravi kondala rao

    కళామతల్లి ముద్దుబిడ్డ మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..

    Jul 28 | ప్రముఖ నటులు, రచయిత, సాహితీవేత్త, పాత్రికేయుడు, దర్శకనిర్మాత రావి కొండలరావు మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కరోనా కష్టకాలంలో సినీపరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడిన... Read more

  • Tv actor ansh bagri badly beaten up by 10 men in delhi

    టీవీ నటుడిపై పది మంది దాడి.. ఇంట్లోకి చోచ్చుకెళ్లి..

    Jul 28 | హిందీ నటుడు అన్ష్ బగ్రీపై దేశరాజధానిలో దాడి జరిగింది. గుర్తుతెలియని పది మంది అగంతకులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన ఇంటి ఆవరణలోకి చోచ్చుకుని వచ్చిన అగంతకులు.. అకారణంగా అతనిపై దాడి... Read more

  • Veteran telugu actor and writer raavi kondal rao passes away at 88

    టాలీవుడ్ లో విషాధం.. రావికొండల రావు కన్నుమూత

    Jul 28 | తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. ఆరు దశాబ్దాల పాటు సినీకళామతల్లికి సేవలు అందించిన కళామతల్లి ముద్దుబిడ్డ, ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, దర్శకనిర్మాత, సాహితీవేత్త, పాత్రికేయుడు రావి కొండలరావు ఇవాళ తుదిశ్వాస విడిచారు.... Read more

  • Tamil actor arrested in chennai for gambling tokens found at flat cops

    నటుడు కిక్ శ్యామ్ ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు

    Jul 28 | సినీపరిశ్రమలో సెలబ్రిటీలుగా ఎదగడానికి చక్కని గుర్తింపుతో పాటు ప్రేక్షకాదరణ పోందడానికి ఎంతో పెట్టి పుట్టాలి. అయితే కొందరు ఎలాంటి కష్టం లేకుండానే దానిని సంపాదించుకుంటారు. మరికోందరు మాత్రం దానిని సంపాదించడానికి అహర్నిశలు కష్టపడతారు. మొత్తానికి... Read more

  • Hero ram charans wife upasana konidela adopts an elephant

    మెగా కోడలు ఉపాసన ఔదార్యం.. గజరాణిని దత్తత..

    Jul 21 | మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల ఔదార్యం మరోమారు బయటపడింది. మెగా కొడలి హోదాతో పాటు అపోలో గ్రూప్ సంస్థల వైస్ చైర్మన్ గా బాధ్యతలు... Read more

Today on Telugu Wishesh