Intresting update from balakrishna next బాలయ్య తదుపరి చిత్రం తాజాగా 'డేంజర్' అఫ్ డేట్

Intresting update from balakrishna boyapati upcoming movie

BalaKrishna, Nandamuri Tiger, Boyapati Srinu, Danger, balayya next, Hatrick combo, Balayya fans, balayya movies, balayya dialogues, Entertainment, movies, Tollywood

An intresting update from Nandamuri Balakrishna upcoming movie is viral online. Top Director Boyapati Srinu is directing Balayya for the Hatrick time and the movie title is yet to be named as Danger.

బాలయ్య తదుపరి చిత్రం తాజాగా ‘డేంజర్’ అఫ్ డేట్

Posted: 07/21/2020 10:29 PM IST
Intresting update from balakrishna boyapati upcoming movie

నందమూరి నటసింహం బాలకృష్ణ, హిట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ రూపోందుతున్న హ్యాట్రిక్ చిత్రం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా.. అని నందమూరి అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. వెండితెర దద్దరిల్లిపోయే బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ వినాలని ఆతృతగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమాపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకుంది ప్రేక్షకలోకం. వీరిద్దరిదీ సక్సెస్ ఫుల్ కాంబో కావడం, పైగా ''సింహా, లెజెండ్'' లాంటి భారీ హిట్ల తర్వాత ఇద్దరి కాంబోలో వస్తున్న హాట్రిక్ మూవీ కావడంతో ఈ మూవీ కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.

ఇటీవలే ఈ మూవీ నుంచి BB3 ఫస్ట్ రోర్ విడుదల చేసి నందమూరి అభిమానుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేశారు మేకర్స్. ఈ వీడియోలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. కొంతభాగం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్ విషయమై పెద్ద ఎత్తున ప్రచారాలు మొదలయ్యాయి. చిత్రానికి 'మోనార్క్' అనే టైటిల్ ఫిక్స్ అయ్యారని వార్తలు వచ్చాయి. కానీ ఫిలింనగర్ నుంచి అందిన లేటెస్ట్ సమాచారం మేరకు టైటిల్ తోనే నందమూరి అభిమానులకు కిక్కిచ్చేలా వుందని సమాచారం.

అందుకు కారణం ఈ చిత్రానికి 'డేంజర్' అనే టైటిల్ ఫైనల్ చేశారని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఇదే టైటిల్‌తో 2005 సంవత్సరంలో కృష్ణ వంశీ దర్శకత్వంలో ఓ సినిమా రిలీజయ్యింది. అయితే ఆ మూవీ విడుదలై పదేళ్లు దాటింది కాబట్టి ఆ పవర్‌ఫుల్ టైటిల్‌పై కన్నేశారట బోయపాటి. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్‌ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పిన బోయపాటి.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. ఈ మేరకు చెప్పినట్లుగానే అందమైన ముంబై మోడల్‌ని ఆయన ఫైనల్ చేసినట్లు టాక్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BalaKrishna  Nandamuri Tiger  Boyapati Srinu  Danger  balayya next  Hatrick combo  tollywood  

Other Articles

Today on Telugu Wishesh