Tarak's Official Statement To Disappointed Fans ఫ్యాన్స్ ను ఓదార్చుతూ.. ఆర్ఆర్ఆర్ టీంకు అండగా తారక్..!

Jr ntr official statement says makers of rrr have tried alot for glimpse

SS Rajamouli, Glimpse of NTR, Tarak on RRR tweet, Ram Charan, Jr.NTR, RRR, Ajay Devgn, Tarak's Birthday, Tollywood, Fans dissappointment, tollywood, Movies, Entertainment

Young Tiger Jr NTR fans were utterly disappointed that the team of ‘RRR’ is unable to come up with the first look or teaser of the magnum opus film. Fans are taking to the social media and are openly expressing their displeasure.

ఫ్యాన్స్ ను ఓదార్చుతూ.. ఆర్ఆర్ఆర్ టీంకు అండగా తారక్..!

Posted: 05/18/2020 05:34 PM IST
Jr ntr official statement says makers of rrr have tried alot for glimpse

తాను కూడా ఎంతో ఆశగా ఎదురుచూశాను.. అయితే వారి కష్టాన్ని కూడా దగ్గరగా చూశాను.. అయినా వారి కష్టం పరిపూర్ణం కాలేదు.. దీంతో నేను నిరాశకు గురయ్యాను.. అయితే వారు పడిన కష్టం మాత్రం వృధాగా పోదు.. అని తారక్ అన్నారు. తన పుట్టిన రోజు నాడు ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయడానికి చిత్రబృందం చాలా కష్టపడింది. కానీ అది చివరకు సాధ్యపడలేదు. అయితే అభిమానులు ఈ విషయంలో ఎలాంటి నిరాశ నిసృహకు లోనుకాకూడదని ఎన్టీఆర్ కోరారు. ఈ మేరకు తన అభిమానులకు తారక్ ఓ లేఖను రాశారు. ఇక కరోనా సమయంలో తన జన్మదిన వేడుకలను జరపొద్దని కోరారు.

కరోనా అపత్కాల సమయంలో అభిమానులు అందరూ వారి కుటుంబసభ్యులతో క్షేమంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఈ ఏడాది మీరు ఇంటి వద్దే ఉంటూ అధికారుల సూచనలు పాటిస్తూ భౌతిక దూరాన్ని కట్టుబడి వుండాలన్నారు. ఇదే అభిమానులు తనకిచ్చే అతి విలువైన బహుమతి అని పేర్కోన్నారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం బృందం ప్రయత్నాలు ఫలించలేదని దీంతో టీజర్‌ విడుదల కావడం లేదనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఫస్ట్ లుక్‌, టీజర్‌ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్ర బృందం ఎంతగా కష్టపడిందో తనకు తెలుసునన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచలనం కలిగిస్తుందన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుందని ఎన్టీఆర్ పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SS Rajamouli  Glimpse of NTR  Tarak on RRR tweet  Ram Charan  Jr.NTR  RRR  Ajay Devgn  Tarak's Birthday  Tollywood  

Other Articles