Sarathkumar gets emotional recalling his bad times ఆయన నిజంగా మెగాస్టారే.. కంటతడి పెట్టిన అగ్రనటుడు..

Sarathkumar gets emotional recalling how chiranjeevi saved him

Chiranjeevi, sarathkumar, megastar, sye raa, Acharya, financial problems, Tv Interview, Lockdown, coronavirus, Kollywood, Tollywood, movies, Entertainment

Actor Sarathkumar recently got emotional while talking about his bonding with Megastar Chiranjeevi. The 'Sye Raa' and 'Acharya' actor, he revealed, had helped him out in the 1990s when he was grappling with financial problems. In saying so, Sarathkumar turned emotional and fought back his tears.

ఆయన నిజంగా మెగాస్టారే.. కంటతడి పెట్టిన అగ్రనటుడు..

Posted: 05/15/2020 07:57 PM IST
Sarathkumar gets emotional recalling how chiranjeevi saved him

ఎంతటివారికైనా కష్టాలు, నష్టాలు తప్పవు. ఇవాళ సుఖపడుతున్నవారు ఒకప్పుడు కష్టపడిన వారే. అయితే సుఖం శాశ్వతంగా ఉండటానికి కించిత్ మంచితనం, మానవత్వం కూడా అవసరమే అంటుంటారు పెద్దలు. సరిగ్గా ఆ విషయాన్ని గుర్తు చేసుకుని టాలీవుడ్ హీరోను చేసిన సాయాన్ని గుర్తుచేసుకుని కంటతడిపెట్టాడు తమిళ నటుడు శరత్‌ కుమార్‌. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 100 చిత్రాలకుపైగా నటించి.. ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్న శరత్ కుమార్ ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా కూడా రాణిస్తున్నారు.

తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ప్రస్తావించిన ఆయన.. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఓ నిర్మాత తన వద్దకు వచ్చి.. ఓ విషయం చెప్పాడని, ఆ విషయాన్ని విన్న తాను ప్రయత్నిద్దామని అనుకున్నానని చెప్పారు. దీంతో హైదరాబాద్లో సినిమా షూటింగ్ లో ఉన్న చిరంజీవి వద్దకు వెళ్లి కలిసానన్నారు. ఆరోజు షూటింగ్ రద్దు చేసి.. తనను చిరంజీవి ఇంటికి తీసుకెళ్లారని అన్నారు. తను పరిస్థితి వివరించానని, నిర్మాత చెప్పిన విషయాన్ని కూడా తెలుపుగానే.. వెంటనే తన సమ్మతిని తెలిపారని తనను అదుకున్నారని అన్నారు.

ఇంతకీ నిర్మాత తనకు చెప్పిన విషయం ఏంటీ.. కష్టాల్లో వున్న తన వద్దకు వచ్చిన ఓ నిర్మాత.. తన స్నేహితుడు చిరంజీవితో సినిమా తీయాలని అనుకుంటున్నారని, ఆయనను సినిమాకు ఒప్పిస్తే.. తనకు సినిమాలో షేర్ ఇస్తానని చెప్పాడని శరత్ కుమార్ ఓ ఇంటర్య్వూలో తెలిపారు. ఇక తాను చిరంజీవికి ఈ విషయం చెప్పగానే కనీసం సినిమాకు పారితోషకం ఎంత అన్న విషయం కూడా అగడకుండానే సంతకం చేసి తనపట్ల ఆయన ఉదారస్వభావతను చాటుకున్నారని చెప్పుకోచ్చని శరత్ కుమార్ కంటతడి పెట్టుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh