పోలీసు అనే పదం వెనుకనున్న కాఠిన్యం గురించి అందరికీ తెలిసిందే కానీ ఆ కాకీ దుస్తులు వెనుకనున్న ఓ మాతృమూర్తి హృదయం మూర్తీభవించిందని కొందరు మాత్రమే గుర్తించగలరు. అలా చేసిన వారితో పాటు వారిని గుర్తించిన వారు కూడా అభినందనీయులే. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో అభాగ్యులను అక్కున చేర్చుకుని అన్నం తినిపించిన ఓ పోలీసు అధికారిణిలో మాతృత్వం చూశానని, ఆమె వ్యక్తిత్వం తన హృదయాన్ని తాకిందని చెప్పారు ఓ అగ్రహీరో. ఆయన మరెవరో కాదు మగాస్టార్ చిరంజీవి.
మాతృ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. రోడ్డుపక్కన మానసిక పరిస్థితి సరిగ్గాలేక ఉన్న వృద్ధురాలికి అన్నం తినిపించిన ఓ పోలీసు అధికారిణి గురించి చిరంజీవి ఈ వీడియోలో చెప్పారు. ఇవాళ ఆ పోలీసు అధికారితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. అమె తెలుగు రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారణి కాదు. పోరుగు రాష్ట్రమైన ఒడిశాకు చెందిన ఆ పోలీస్ అధికారిణి అమె. అమె పేరు శుభశ్రీ. అమెతో ఇవాళ ప్రత్యేకంగా మాట్లాడిన వీడియోను చిరంజీవి ఇవాళ షేర్ చేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా తెలుసుకున్న శుభశ్రీ చిరంజీవి చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, స్వచ్ఛంధ కార్యక్రమాలను కూడా ప్రశంసించారు. చిరంజీవి అమెలో ఓ మాతృమూర్తి హృదయం మూర్తీభవించిందని కొనియాడారు. మీరు మతి స్థిమితం లేని మహిళకు భోజనం తినిపిస్తున్న వీడియోను చూసిన నాటి నుంచి.. మీతో మాట్లాడాని చాలా ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఇలాంటి పని చేసినందుకు మిమల్ని అభినందించాలని, మీరు మరిన్నీ ఇలాంటి కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించాలని భావించానని చిరంజీవి చెప్పారు. ఇక వారిద్దరి మధ్య జరిగిన పూర్తి సంభాషణ సారాంశాన్ని మీరూ నేరుగా చూసేయండి!
So delighted to chat with #Shubhasri ji ,the Odisha Cop who cares for citizens like her own.Salute her compassion. @CMO_Odisha @Naveen_Odisha @DGPOdisha pic.twitter.com/15ZURVUITc
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2020
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more