Tamannaah on failure of Himmatwala and Humshakals ఫాఠాలు నేర్పిన చిత్రాలు.. ఆశలు చిగురిస్తాయి: తమన్నా

Tamannaah on failure of himmatwala humshakals it was very difficult time of my life i didn t

Tamannaah, Tamannaah interview, Himmatwala, Humshakals, Failure, Prabhas, Bahubali, Lockdown, coronavirus, Bollywood

Tamannaah in an exclusive interview with Bollywood Hungama’s Faridoon Shahryar talks about helping 10 Thousand Migrant Labourers. She talks about her Lockdown routine. She also talks about her films Paiyaa, Kalloori and Tamil remake of Kick.

ఫాఠాలు నేర్పిన చిత్రాలు.. ఆశలు చిగురిస్తాయి: తమన్నా

Posted: 05/11/2020 09:35 PM IST
Tamannaah on failure of himmatwala humshakals it was very difficult time of my life i didn t

మిల్కీబ్యూటీ తమన్నా తన నటనాభియనంతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తూనే వుంది. దీంతో బాలీవుడ్ తెరపై కూడా మెరిసి తన సత్తా చాటుకోవాలని ఆరాటపడింది. ఆమె ప్రయత్నాలు ఫలించి, తొలి చిత్రంగా 'హిమ్మత్ వాలా' చేసింది. అయితే అనుకున్న స్థాయిలో ఆ చిత్రం ప్రేక్షకాధరణ పోందలేకపోయింది. దీంతో ఈ సినిమాపై తమన్నా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. బాలీవుడ్ లో నిలదోక్కుకోవాలని ఎన్నో ఆశలతో చేసిన హిమమత్ వాలా చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్నంతగా రాణించలేకపోయిందని అన్నారు.  

అయితే అదే సమయంలో ఇతర భాషా చిత్రాలతో తాను బిజీగా ఉండటం వలన, ఆ సినిమా పరాజయం తనను ఎక్కువకాలం పాటు వెంటాడలేకపోయింది. అయితే బాలీవుడ్ అవకాశాలను మాత్రం మృగ్యం చేసిందని అభిప్రాయపడింది. కాగా సినిమా ఫ్లాప్ అయినా తనకు ఒక పాఠం నేర్పినందుకు ఆనందపడ్డింది. ఒక కథను ఒప్పుకోవడానికి ముందు ఎంతలా ఆలోచించాలి .. ఒక పాత్ర చేయడానికి ముందు ఆ పాత్రను గురించి ఎంతవరకూ తెలుసుకోవాలి వంటి విషయాలు తనకు అర్థమయ్యాయని తెలిపింది.

అప్పటి నుంచి కెరియర్ పరంగా తాను జాగ్రత్త పడటానికి ఆ సినిమా తనకు చాలా హెల్ప్ అయిందని అన్నారు. అందువలన ఆ సినిమా తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చారు. అయితే బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు వచ్చిన అవకాశం హిమ్మత్ వాలా తో పాటు హమ్ షకల్స్ చిత్రాలతో ఇక కనుమరుగైనట్లేనా అంటే అలాంటిదేమీ లేదని చెప్పుకోచ్చింది. చీకటి తరువాత వెలుతురు వస్తుందన్నట్లు.. తన ఆశలు కూడా మళ్లీ చిగురించవచ్చని తెలివిగా సమాధానమిచ్చింది తమన్నా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamannaah  Tamannaah interview  Himmatwala  Humshakals  Failure  Prabhas  Bahubali  Lockdown  coronavirus  Bollywood  

Other Articles