Vakeel Saab Aiming For Sankranthi Release? కొత్త అలుళ్ల హడావిడిలో సందడి చేస్తానంటున్న 'వకీల్ సాబ్'!

Pawan kalyans vakeel saab aiming for sankranthi release

Pawan Kalyan, Venu Sriram, Vakeel Saab Movie, Dil Raju, Boney Kapoor, PINK Remake, Tollywood, Movies, Entertainment

Vakeel Saab starring Pawan Kalyan in the titular role, is aiming for Sankranthi release given the circumstances. Film shootings are expected to begin from June and Dil Raju is hopeful of finishing the balance work of Vakeel Saab quickly once the shooting resumes.

కొత్త అలుళ్ల హడావిడిలో సందడి చేస్తానంటున్న 'వకీల్ సాబ్'!

Posted: 05/08/2020 06:51 PM IST
Pawan kalyans vakeel saab aiming for sankranthi release

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకోవలసింది. కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. పవన్ కల్యాణ్ పోర్షన్ కి సంబంధించి 20 రోజుల చిత్రీకరణ మిగిలివుంది. ఇతర పాత్రల కాంబినేషన్లో మరో 20 రోజుల చిత్రీకరణ చేయవలసి వుంది.  అంటే ఇంకా 40 రోజుల చిత్రీకరణ జరపవలసి వుంది. అందువలన లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత తిరిగి షూటింగును ఆరంభిస్తే, ఆగస్టులో షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు.

వాస్తవానికి ఈ ఏడాది వేసవి సెలవుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుండగా, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. దీంతో ఇప్పుడీ చిత్రం ఎపుడు విడుదల చేయాలా.? అన్న అలోచనలో చిత్ర నిర్మాత దిల్ రాజు వున్నట్లు సమాచారం. అయితే దసరా .. దీపావళి .. క్రిస్మస్ పర్వదినాల్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచన 'దిల్'  రాజుకి లేదని చెబుతున్నారు. ఆయన ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపాలని భావిస్తున్నాడట.

కాగా, రైతుల పంట ఇళ్లకు చేరుకునే సమయంలో అంతా సందడిగా వున్నప్పుడే వకీల్ సాబ్ వస్తాడని సినీవర్గాల సమాచారం. అంటే సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడని అంటున్నారు. అయితే, ఒకవేళ ముందుగా చెప్పినట్టే  'ఆర్ ఆర్ ఆర్' కూడా సంక్రాంతికి వస్తే కనుక అప్పుడు వేరే ఆలోచన చేయవచ్చనేది 'దిల్' రాజు ఆలోచనట. ఇక  తమిళ .. హిందీ భాషల్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, తెలుగులోనూ అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందని చిత్ర నిర్మాతలు ఆశిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Venu Sriram  Vakeel Saab Movie  Dil Raju  Boney Kapoor  PINK Remake  Tollywood  

Other Articles