Tollywood producer Dil Raju gets married రెండో వివాహం చేసుకున్న టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు..

Telugu film producer dil raju gets married for the second time

Dil Raju, Tejeswini, anitha reddy, dil raju second marriage, anitha reddy death, coronavirus, narsingpalli village, nizamabad, raju, sri venkateswara swamy temple, tejaswini, Dil Raju new wife, Dil Raju wedding, Dil Raju marriage, telangana, telugu film industry, tollywood, movies, entertainment

Dil Raju, known as one of the most successful producers in the Telugu film industry, married Tejaswini on Sunday evening. This was his second marriage after the demise of his first wife Anitha Reddy in 2017.

లాక్ డౌన్ పెళ్లి: తేజస్వినీని పరిణయమాడిన నిర్మాత దిల్ రాజు

Posted: 05/11/2020 07:54 PM IST
Telugu film producer dil raju gets married for the second time

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. నిన్న రాత్రి నిజామాబాద్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో తనకు సుపరిచితురాలైన యువతిని పరిణయమాడారు. లాక్ డౌన్‌ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. తమ కుటుంబానికి ముందు నుంచీ పరిచయం ఉన్న మహిళ తేజస్వినిని (వైఘా రెడ్డి) దిల్‌రాజు వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌కు చెందిన ఆమె హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గతంలో ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేసినట్లు సమాచారం.

దిల్‌ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మృతి చెందారు. తన రెండో పెళ్లి గురించి దిల్‌ రాజు నిన్న పరోక్షంగా అభిమానులకు సంకేతమిచ్చిన విషయం తెలిసిందే. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఆయన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. గత కొంతకాలం నుంచి తన జీవితంలో ఎలాంటి సంతోషం లేదని.. తన వ్యక్తిగత జీవితాన్ని పునఃప్రారంభించడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా దిల్‌రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘మీరు ఎల్లప్పుడూ నాకు బలంగా ఉన్నారు. నన్ను సంరక్షించినందుకు.. నిరంతరం కుటుంబ సభ్యుల ఆనందానికే ప్రాధాన్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన మీరిద్దరు సంతోషంగా, ప్రేమతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రోజు మీకు ఓ అద్భుతమైన రోజు కావాలని ఆశిస్తున్నా. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా.. మీ హన్షు’ అని ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  Tejeswini  anitha reddy  second marriage  Hanshita Reddy  nizamabad  Telangana  tollywood  

Other Articles