Celebs Urge Vizag People To Stay Strong విశాఖలో విషవాయువులపై టాలీవుడ్ ప్రముఖుల దిగ్భ్రాంతి..

Vizag gas leak chiranjeevi mahesh babu express pain celebs urge people to stay strong

chiranjeevi on gas leak, Mahesh babu on gas leak, Pawan Kalyan on gas leak, NTR on gas leak, Ramcharan on gas leak, Nani on gas leak, Visakha gas leak, Allu Arjun, Varun Tej, Sai Dharam Tej, Manchu Manoj, Ravi Teja, Nani, Lavanya Tripathi, Rakul singh, Tammannah bhatia, Tollywood

Tollywood celebrities, including Megastar Chiranjeevi, Superstar Mahesh Babu, have reacted to the Visakhapatnam gas leak tragedy. Megastar Chiranjeevi in a tweet said that the incident has deeply moved him and he expressed grief.

విశాఖలో విషవాయువులపై టాలీవుడ్ ప్రముఖుల దిగ్భ్రాంతి..

Posted: 05/07/2020 08:09 PM IST
Vizag gas leak chiranjeevi mahesh babu express pain celebs urge people to stay strong

విశాఖ ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన విషవాయువు లీకైన దుర్ఘటనపై తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా తమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సడలింపుల నేపథ్యంలో పరిశ్రమలను పునఃప్రారంభం చేసేముందు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సినీ సెలబ్రిటీలు కోరుతున్నారు. ఈ ఘటనపై ఎవరెవరు ఎలా స్పందించారంటే..

* విశాఖలో విషవాయువు స్టైరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమలను పునఃప్రారంభిస్తున్నప్పుడు అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను’ - చిరంజీవి

* విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన వార్త తన హృదయాన్ని బాధించింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. -మహేశ్ బాబు ట్వీట్

* నా జీవితంలో చాలాప్రత్యేకమైన ప్రాంతాల్లో ఒకటైన వైజాగ్‌ను ఈపరిస్థితుల్లో చూస్తోంటే నా హృదయం పగిలినంత పనైంది. ఈభయంకర ప్రమాదం నన్ను కలచి వేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను'  -అల్లు అర్జున్

* విశాఖ గ్యాస్ లీక్ ఘటన హృదయవిదారకమైనదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 8 మంది మృతి చెందడం, వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని.. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇలాంటి ఘటనలు విశాఖలో తరచూ జరుగుతున్నాయని, ఇకపై అవి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వీటి వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని అధికారులు ఇలాంటి ఘటనలపై బాద్యతగా మెలగాలని పవన్ సూచించారు.

* వైజాగ్ గ్యాస్‌ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. Stay strong Vizag’ - ఎన్టీఆర్‌

* వైజాగ్‌ గ్యాస్‌ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్‌ చూసి ఎంతో కలత చెందాను. వాటిని చూడగానే ఇబ్బందిగా అనిపించింది. ఈ ప్రమాదం బారిన పడిన కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం మళ్లీ సాధారణ స్థాయిలోకి రావాలని కోరుకుంటున్నాను’ - సాయిధరమ్‌ తేజ్‌

* మరో బాధాకరమైన విషయం మనల్ని కలచివేసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్‌ చూస్తే ఎంతో బాధగా అనిపించింది. ఈ ఘటనలో తమకు ఎంతో ఇష్టమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. పునఃప్రారంభం చేసే సమయంలో ప్రతి పరిశ్రమ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను’ - వరుణ్‌ తేజ్‌

* ‘2020 ఇంత కష్టంగా ఎందుకు ఉంది? ఉదయాన్నే వైజాగ్‌లోని ఎల్‌జి పాలిమర్స్‌లో జరిగిన ఈ గ్యాస్‌ లీక్‌ వార్త వినగానే బాధగా అనిపించింది. వారి వారి కుటుంబాలకు నా ప్రగాఢసానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే చికిత్స తీసుకుంటున్న వారందరూ త్వరగా కోలుకోవాలని భావిస్తున్నాను’ - మంచుమనోజ్‌

* ఈ బాధాకారమైన వార్తతో నిద్రలేచాను. ఎవరైతే త*మకు ఇష్టమైన వారిని కోల్పోయారో వారందరికీ నా సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’ - తమన్నా

* వైజాగ్‌.. ఉదయం జరిగిన ప్రమాదం వల్ల ఇప్పటికీ ఆగ్యాస్‌ అక్కడి గాలిలో ఉంటుంది. కాబట్టి ఆప్రాంతానికి దగ్గర్లో ఉన్న ప్రజలందరూ వెట్‌ మాస్క్‌తో ముఖాన్ని కప్పుకోగలరు.’ - నిఖిల్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles