Nani to sport Six Pack abs in Shyam Singha Roy ‘శ్యామ్ సింగ రాయ’ కోసం నాని వర్క్ అవుట్..

Nani to flaunt six pack abs for rahul s shyam singha roy

Sudheer Babu, Rahul Sankrityan, Shyam Singa Raya, six-pack abs for the character, neo-noir thriller, Natural Star Nani, Suryadevara Naga Vamsi, Sai Pallavi, Indraganti Mohan Krishna, Aditi Rao Hydari, Tollywood, movies, Entertainment

Natural Star Nani's 27th film has been titled Shyam Singha Roy. The film is being directed by Rahul Sankrityan. Produced by Suryadevara Naga Vamsi, the film is reported to be a sci-fi thriller, and will go on floors in May. Sources say the Nani will be toning his body and gaining six-pack abs for the character. He is working very hard to attain the fit physique.

‘శ్యామ్ సింగ రాయ’ కోసం నాని వర్క్ అవుట్..

Posted: 05/08/2020 04:44 PM IST
Nani to flaunt six pack abs for rahul s shyam singha roy

న్యాచురల్ స్టార్ నాని.. తన మేకోవర్ కన్నా చిత్ర కథకు అధిక ప్రాధాన్యతను ఇస్తూన్న విషయం తెలిసిందే. తాను ఎంచుకనే కథలో వైవిద్యానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ.. అందుకు మేక్ ఒవర్ లో కొంతవరకు మార్పులు చేసుకుంటాడు. కానీ లుక్స్ పరంగా పెద్దగా మార్పు చూపించడానికి నాని పెద్దగా ఆసక్తిని కనబరచడు. పక్కింటి అబ్బాయి మాదిరిగా కనిపించడానికే ఆయన ఉత్సాహాన్ని చూపుతాడు. అలాంటి నాని తన తదుపరి చిత్రం 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నట్టు చిత్రపురిలో వార్తలు గుప్పుమంటున్నాయి. నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వి' ముస్తాబవుతోంది. ఆ తరువాత ఆయన శివ దర్శకత్వంలో 'టక్ జగదీశ్' సినిమాను పూర్తిచేయనున్నాడు.

ఆ తరువాత రాహుల్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు.  ఈ సినిమాలోనే నాని సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉంటున్న నాని, సిక్స్ ప్యాక్  కోసం గట్టిగానే వర్కౌట్స్ చేస్తున్నాడని చెబుతున్నారు. చూస్తుంటే నాని ఈ సారి సాహసమే కాదు .. పెద్ద ప్రయోగం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఎంపిక చేసేశారట. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, లాక్ డౌన్ తరువాత సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles