Chiranjeevi is a holy human being: JD Chakravarthy ఇన్నాళ్లు నేను మెగాస్టార్ కు అభిమానినే.. కానీ ఇప్పుడు: జేడీ

Iam fan of chiranjeevi not a follower jd chakravarthy sensational comments

jd chakravrthy twitter, chiranjeevi twitter, jd chakravrthy chiranjeevi CCC letter, chiranjeevi not megastar,jd chakravrthy open letter to chiranjeevi, jd chakravarthi letter to megastar chiranjeevi, jd chakravarthy, jd chakravarthy about chiranjeevi ccc, jd chakravarty about chiranjeevi, jd chakrabarthy letter, jd chakravarthy open letter to mega star chiranjeevi, jd chakravarthy open letter to mega star chiranjeevi on ccc, jd chakravarthy twitter post, Tollywood, movies, Entertainment

JD Chakravarthy has hailed Megastar Chiranjeevi to the skies. In an open letter to the legendary actor, JD on Sunday described the 'Sye Raa' star as a holy human being. The Chiranjeevi-supervised Corona Crisis Charity has been lending a helping hand to thousands of cine workers. JD says in the letter that he has been hearing a lot of good things about the noble deeds of Chiru, who had donated Rs 1 Cr to CCC in March.

ఇన్నాళ్లు నేను మెగాస్టార్ చిరంజీవికి అభిమానినే.. కానీ ఇప్పుడు: జేడీ

Posted: 05/04/2020 07:39 PM IST
Iam fan of chiranjeevi not a follower jd chakravarthy sensational comments

టాలీవుడ్ మెగాస్టార్.. మాజీకేంద్రమంత్రి, రాజ్యసభసభ్యుడు.. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, దానికన్నా ముందు ప్రజారాజ్యం పార్టీ అధినేత.. ఇలా పలు విధాలుగా చిరంజీవి తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు. వాటిన్నింటికన్నా ఆయనను ఆ స్థాయికి తీసుకెళ్లింది మాత్రం కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. అభిమానులే తన అయువు.. వారి సంక్షేమమే తన కర్తవ్యం అని ఎంతటి స్థాయికి ఎదిగినా.. తన అభిమాని బాధపడకూడదని ఆయన వారి కోసం బ్లడ్ బ్యాంకు, ’ఐ’ బ్యాంకు ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక చిరంజీవికి ప్రేక్షకులలోనే కాదు.. సినీపరిశ్రమలో కూడా అభిమానులు వున్నారంటే అది ఆయనకున్న క్రేజ్ అని చెప్పక తప్పదు.

అయితే ఓ టాలీవుడ్ హీరో అప్పట్లోనే తన అభిమాన హీరో చిరంజీవి అని నిర్మోహమాటంగా చెప్పారు. ఇక ఆయన తాజాగా తాను మెగాస్టార్ కు కేవలం అభిమానిని మాత్రమేనని, కానీ అనుచరుడ్ని కాదు అని తేల్చిచెప్పారు. అంతటితో ఆగకుండా మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో చిత్రపరిశ్రమ పేదలను అదుకునేందుకు చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రైసెస్ ఛారిటీపై కూడా జేడీ చక్రవర్తికీలక వ్యాఖ్యలు చేశారు, ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన ఓ బహిరంగ లేఖను కూడా రాశాడు. దాని సారంశం ఆయన మాటల్లోనే..

'ప్రియమైన చిరంజీవి.. నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. ఎప్పట్నుంచో మిమ్మల్ని నేను నటుడిగా మాత్రమే ఇష్టపడేవాడ్ని.. ఒకప్పుడు నా తోటి నటులంతా సాయంత్రం అయ్యే సరికి మీ దగ్గరికి వచ్చి సమయం గడపడానికి ఆసక్తి చూపించే వాళ్లు.. కానీ నేనెప్పుడూ మీ దగ్గరికి రాలేదు.. రావాలనే ఆలోచన కూడా రాలేదు. ఇది నేను మీకు బహిరంగంగా రాస్తున్న లేఖ.. కరోనా వైరస్ తీసుకొచ్చిన నష్టం మాటల్లో చెప్పలేం.. లాక్‌డౌన్ చేయడంతో సినిమా పరిశ్రమ కూడా ఎంతో కోల్పోయింది. మాటల్లో చెప్పలేనంతగా సినీ కార్మికులు నష్టపోయారు.

అందులో నాతో పాటు మీరు కూడా ఉన్నారు.. మనం కూడా ఎంతో కొంత కోల్పోయాం.. ఈ ఆపత్కాలంలో ఇతరుల్ని ఆదుకోవడానికి మీరు ముందుకు రావడం అద్భుతం. అభిమానులే కాదు.. అందరూ మిమ్మల్ని ఎందుకు అంతగా ఇష్టపడతారో.. నమ్ముతారనే దానికి మీరు ఇప్పుడు చేస్తున్న కరోనా క్రైసిస్ ఛారిటీ నిదర్శనం. మీరు నా దృష్టిలో మెగాస్టార్ కాదు.. అంతకంటే ఎక్కువ.. ఓ గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని అభివర్ణించాలి. కొన్ని రోజుల క్రితం కొందరు సినీ కార్మికులు నాకు ఫోన్ చేశారు. ఈ సమయంలో చిరంజీవి గారు లేకపోయుంటే నిజంగానే ఆకలితో చచ్చిపోయేవాళ్లం అని.. తమ కుటుంబాలకు ఇప్పుడు ఎలాంటి ఆకలి సమస్యలు లేవని.. అదంతా చిరంజీవి చలువే అని.. ఆయన తమకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందించారని తెలిపారు.

మీకు అన్నం పెట్టిన చిత్ర పరిశ్రమకు ఇప్పుడు మీరు ఇలా రుణం తీర్చుకుంటున్నానని వాళ్లు నాతో చెప్పారు.. కానీ కార్మికుల పట్ల అది మీకున్న గౌరవం అని నేను భావిస్తున్నా. పది మందికి సాయం చేయాలనుకునే గుణం అద్భుతం.. చాలా మందికి హృదయం ఉంటుంది.. కానీ అది సరైన స్థానంలో లేక సాయం చేసే మనసు ఉండదు.. అందులో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు నేను మెగాస్టార్ ని మరింత అభిమానిస్తున్నా. నలుగురి ఆనందం కోరుకునే మీ వ్యక్తిత్వం గొప్పది. నేనెప్పటికీ మీ అభిమానిని.. ఇకపై అనుచరుడిని కూడా.. మిమ్మల్ని అమితంగా ఇష్టపడుతున్నా, ప్రేమిస్తున్నా. లాక్‌డౌన్ లేకపోతే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడ్ని. ఓ మంచి వ్యక్తిగా ఎలా మారాలనే విషయాన్ని మీ దగ్గర నేర్చుకోవాలి' అని జేడీ లెటర్ రాసాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles