SS Rajamouli's next will star Mahesh Babu అఫిషియల్: సూపర్ స్టార్ తోనే రాజమౌళి తదుపరి చిత్రం..

Ss rajamouli mahesh babu to team up after rrr release

Mahesh Babu, SS Rajamouli, Mahesh Babu and Rajamouli, KL Narayana, Durga Arts, Mahesh Babu SS Rajamouli new project, RRR, NTR, Ram Charan, tollywood, movies, entertainment

SS Rajamouli has been working on his upcoming big-budget flick, RRR, which brings together Ram Charan and Jr NTR for the first time. For the past couple of months, there have been rumours about Mahesh Babu joining hands with Rajamouli for a film.

అఫిషియల్: సూపర్ స్టార్ తోనే రాజమౌళి తదుపరి చిత్రం..

Posted: 04/18/2020 05:54 PM IST
Ss rajamouli mahesh babu to team up after rrr release

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తే చూడాలని సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాను మహేశ్‌బాబుతో తప్పకుండా ఓ సినిమా చేస్తానని ఇప్పటికే రాజమౌళి చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత రాజమౌళి ప్రభాస్‌తో సినిమా చేయనున్నారంటూ గత కొన్ని రోజుల క్రితం సోషల్‌మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై జక్కన్న స్పందించారు.

తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం రూపోందిస్తున్న‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్ పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారని ఆయన వెల్లడించారు. సాధారణంగా రాజమౌళి.. ఒక సినిమా చేస్తున్నప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ఎప్పుడూ బయటపడలేదు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేస్తుండగానే మహేశ్‌ ప్రాజెక్ట్‌ గురించి ప్రకటించారు.

దీంతో మహేశ్ బాబు అభిమానులతోపాటు సినీ ప్రియులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహేశ్‌బాబుకు సెట్‌ అయ్యే విధంగా తన దగ్గర ఓ మంచి స్టోరీ లైన్‌ ఉందని, దానిని డెవలప్‌ చేస్తున్నానని ఒకానొక సందర్భంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ తెలిపిన విషయం విదితమే. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత రాజమౌళి-మహేశ్‌ కాంబోలో సినిమా ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh