Music director Koti's tribute to police personnel పోలీసులను కొనియాడుతూ కోటి పాట.. ‘‘జయహో పోలీస్’’

Music director koti s tribute to police personnel

Music Director Koti, jai ho police, coronavirus, covid_19, importance, social distancing, Lockdown, fight against corona, essential commodities, Telugu Movies News, Telugu movie News, Covid 19 help desk Andhra Pradesh, Covid 19 Helpdesh Telangana, lockdown meassures, movies, entertainment,

After composing a song on the importance of social distancing, music director Koti has come up with another song, but this time to spread awareness about the importance of the police department. The song Jai Ho Police features numerous police personnel from both the Telugu states who’re currently serving during lockdown.

పోలీసులను కొనియాడుతూ కోటి పాట.. ‘‘జయహో పోలీస్’’

Posted: 04/18/2020 06:57 PM IST
Music director koti s tribute to police personnel

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న తరుణంలో మన దేశంలోని పాలకులు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయినా ప్రజలు తమ కార్యకలాపాల కోసం షరామామూలుగా వీధుల్లో తిరగడంతో పోలీసులకు పనిభారం ఎక్కువైంది. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా అహర్నిశలు కష్టపడుతున్నారు. ఏమాత్రం అప్రమత్తత పాటించకపోయినా తమను కూడా ఈ వైరస్ కబళిస్తోందని తెలిసినా.. తాము మాత్రం విధులను నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసుల సేవలను దేశవ్యాప్తంగా పలువురు కొనియాడుతున్నారు.

ఈ కోవలోనే తాజాగా టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కూడా చేరారు. ‘జయహో పోలీస్‌.. యు ఆర్‌ ది వారియర్స్‌‌.. యు ఆర్‌ ది సేవియర్స్‌’.. అని అంటున్నారు. ఇటీవల కరోనా వైరస్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ‘వి గోనా ఫైట్‌ కరోనా ఏదేమైనా’ అనే పాటను అలపించిన ఆయన తాజాగా పోలీసులపై ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో మన సంక్షేమం కోసం తమ కుటుంబాలను వదులుకుని పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారు చేస్తున్న సేవలకు సెల్యూట్‌ చేస్తూ కోటి తనదైన శైలిలో పాట రూపంలో ధన్యవాదాలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles