'O Manishi Nuvvevaru' to be released in 7 languages ఏడు బాషల్లో విడుదలకు సన్నధమవుతున్న ‘ఓ మనిషి నీవెవరు’

O manishi nuvvevaru moive to be released in seven languages

O Manishi Nuvvevaru, O Manishi Neevevaru, Suman, Gopala Krishna, Raj Kumar Naidu, Seven Languages, Hindi, Odiya, Tamil, kannada, malayalam, English, Telugu, bollywood, Kollywood, mollywood, tollywood, movies, entertainment

'O Manishi Nuvvevaru' moive is ready for censor as of the lockdown is lifted up, which is to be released in 7 indian languages including English. Suman is playing the main role in the film.

ఏడు బాషల్లో విడుదలకు ‘ఓ మనిషి నీవెవరు’

Posted: 04/13/2020 05:53 PM IST
O manishi nuvvevaru moive to be released in seven languages

రిజ్వాన్ క‌ల్‌షాన్, సుమ‌న్, చ‌ల‌ప‌తిరావు, హ‌రి, త‌రుణ్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం ‘ఓమ‌నిషి నీవెవ‌రు’. గాడ్ మినీస్ర్టీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ర్ణ క్రియేష‌న్స్ ప‌తాకంపై కృష్ణ మూర్తి రాజ్ కుమార్  నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో స్వ‌ర్ణ కుమారి దొండ‌పాటి నిర్మించారు. ప్ర‌భాక‌ర్ సంగీతం అందించారు. ఈ సినిమా ఏడు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, ఒడిస్సా, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తొలి కాపీ సిద్ధమై సెన్సార్ కార్యక్రమాల కోసం రెడీగా వుంది.

ఈ సందర్భంగా హీరో సుమ‌న్ మాట్లాడుతూ: ‘కరోనా వైరస్ వల్ల ప్రపంచం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలోనే అందరూ తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ సినిమాలో నటించడం ఒక అదృష్టంగా భావించి చేసాను. నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు నిర్మించాలి అంటే గట్స్ వున్న మా గోపాల కృష్ణ లాంటి నిర్మాతలు మాత్రమే చెయ్యగలరు. నటీ న‌టులంద‌రు ఎంతో క‌మిట్‌మెంట్‌తో నటించారు. ఏసు పాత్ర‌కు రిజ్వాన్ బాగా సూట‌య్యాడు. చిత్రంలోని పాట‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అన్ని భాషల్లోనూ గొప్ప విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకొస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది’ అని అన్నారు.

స్ర్కీన్‌ప్లే ర‌చ‌యిత, చిత్ర నిర్మాత గోపాల‌కృష్ణ దొండ‌పాటి మాట్లాడుతూ: ‘ఏసు ప్రభు ఆశీర్వచనాలు వలన త్వరలోనే కరోనా మహమ్మారి నిర్మూలనకు ఆశిస్తున్నాను. దయామయుడైన ఏసు ప్రభు గురించి సినిమాని నిర్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పక్కా ప్లానింగ్‌తో అందరి కోపరేషన్‌తో గ్రాండ్‌గా నిర్మించాను. ఇటీవల నటశేఖర కృష్ణ గారు రిలీజ్ చేసిన ఈ సినిమాలోని పాటలు మంచి హిట్ అయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలకు రెడీ అయిన ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళ, ఒడిశా భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసాము’   అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : O Manishi Nuvvevaru  Suman  Gopala Krishna  Raj Kumar Naidu  Seven Languages  bollywood  tollywood  

Other Articles