Allu Arjun Writes To Wife Sneha On Anniversary పెళ్లిరోజున అర్థాంగికి అల్లు అర్జున్ అద్బుతమైన ట్వీట్

Time is getting over fast allu arjun writes to wife sneha on anniversary

Allu Arha, Allu Ayaan, allu sneha reddy, Allu Arjun video, Allu Arjun cute video daughter, allu arjun video with daughter arha, allu arha, allu arjun, allu arjun and arha funny banter, allu arjun and arha viral video, allu arjun movies, ala vaikunthapurramloo, stylish star, 50 days of ala vaikunthapurramloo, tollywood news, Entertainment, latest Cinema news, tollywood

Actor Allu Arjun brought his anniversary celebrations with wife Sneha to Instagram. On the morning of his 9th wedding anniversary, the south superstar flipped through the pages of his wedding album and picked out a timeless photo from their shaadi day to write a touching note for his wife.

పెళ్లిరోజున అర్థాంగికి అల్లు అర్జున్ అద్బుతమైన ట్వీట్

Posted: 03/06/2020 06:13 PM IST
Time is getting over fast allu arjun writes to wife sneha on anniversary

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురంలో బాక్సాఫీసును షేక్ చేస్తూ యాభై ఐదు రోజులను పూర్తి చేసుకుని దిగ్విజయ యాత్రను కోనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో చిత్రం హిట్ అయన సంతోషంలో వున్న హీరో తన జీవిత భాగస్వామి స్నేహరెడ్డితో కలసి మరో వసంతంలోకి అడుగు పెట్టాడు. స్నేహారెడ్డిని తన అర్థాంగిగా చేసుకుని మరో వసంతంలోకి పయనం అవుతున్న వేళ.. తన భార్య స్నేహారెడ్డికి బన్నీ శుభాకాంక్షలు తెలిపాడు.

ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ పెళ్లి ఫొటోను షేర్ చేసిన బన్నీ... తన భార్యపై అమితమైన ప్రేమాభిమానాలను కురిపిస్తూ మెసేజ్ పెట్టాడు. 'తొమ్మిదేళ్ల వివాహబంధం. కాలం వేగంగా పరుగెడుతోంది. కానీ మన మధ్య ప్రేమ మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది' అంటూ తన భార్యపై ప్రేమను కురిపించాడు. దీనికి తోడు భార్య, పిల్లలతో కేక్ కట్ చేసిన ఫొటోను ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. జీవితంలో ఎంతో విలువైన బహుమతులను (కుమారుడు, కుమార్తె) నాకు అందించినందుకు థాంక్యూ క్యూటీ అని తెలిపాడు.

2011లో వివాహబంధంతో ఇదే రోజున ఒక్కటైన ఈ జంట.. ఇవాళ తమ తొమ్మిదవ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాణంలో ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ రూపొందించిన వరుడు చిత్రం ఆడియో లాంచ్ సభలో తనయుడి మనస్సులో వున్న కొరికను అర్థం చేసుకున్న తండ్రిగా అల్లు అరవింద్.. అదే వేదికపై వారి పెళ్లి ప్రకటన చేశారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2011లో వారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles