Akhil Akkineni injured right hand elbow యంగ్ హీరో అఖిల్ కు షూటింగ్ లో గాయం

Most eligible bachelor akhil akkineni gets injured on the sets

akhil akkineni, most eligible bachelor, akhil akkineni's movies, most eligible bachelor movie shoot, akhil akkineni injured, akhil right hand elbow, Pooja Hegde, Aamani, Murali Sharma, Vennela Kishore, Jayaprakash, Pragathi, Bunny vas, Geetha Arts 2 banner, Bhasker, tollywood, movies, entertainment

Actor Akhil Akkineni recently got injured on the sets of the upcoming Telugu film, 'Most Eligible Bachelor'. The filming has been temporarily halted.

షూటింగ్ లో గాయపడిన అఖిల్ అక్కినేని.. యాక్షన్ సన్నివేశాల..

Posted: 03/05/2020 10:13 PM IST
Most eligible bachelor akhil akkineni gets injured on the sets

టాలీవుడ్‌ యంగ్ హీరో.. అక్కినేని మరో సినీవారసుడు అఖిల్ అక్కినేని షూటింగ్ లో ప్రమాదం బారిన పడ్డాడు. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమాలో హీరోగా నటిస్తున్న ఆయన షూటింగ్ సందర్భంగా గాయపడినట్లు వార్తలు అందుతున్నాయి. ఆయనకు ఎలా గాయమైంది.? ఎలా ప్రమాదానికి గురయ్యారన్న ఉత్కంఠక అభిమానుల్లో కలుగుతోంది. షూటింగ్‌లో భాగంగా తాజాగా అఖిల్‌పై కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారని, ఈ సందర్భంలో ఆయన గాయపడ్డారని తెలుస్తోంది.

యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అఖిల్‌ గాయపడ్డాడట. ప్రమాదంలో అఖిల్‌ కుడి మోచేతికి గాయమై బాగా వాయడంతో వైద్యులు వారం రోజులపాటు ఆయనకు విశ్రాంతిని సూచించారని పలు వెబ్‌ సైట్లలో వార్తలు వస్తున్నాయి. వాపు అధికంగా వుండటంతో చేతి ఎముకకు ఎయిర్ క్రాక్ ఫ్ర్యాక్చర్ ఏర్పడిందా..? అన్న ప్రశ్నలు కూడా అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ షూటింగ్‌ను కొంతకాలంపాటు వాయిదా వేసినట్లు ఆయా వార్తల్లోని సమాచారం.

అయితే అఖిల్ ప్రమాదానికి గురైన విషయంలో ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడికాలేదు. గీతా అర్ట్స్ 2 (జీఏ2) పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రానికి బన్నీవాస్‌, వాసు వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గోపీ సుందర్‌ బాణీలను అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మనసా.. మనసా’ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. వేసవి కానుకగా ఏప్రిల్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil Akkineni  Most Eligible Bachelor  Injured  right hand elbow  Pooja Hegde  Bhasker  tollywood  

Other Articles

Today on Telugu Wishesh