ఒక వైపున చందూ మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' సినిమాను మొదలెట్టిన నిఖిల్, మరో వైపున సూర్యప్రతాప్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా మొదలుకానుంది. ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లేను సుకుమార్ అందించడం విశేషం. ఈ సినిమాకి '18 పేజెస్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన 'కుమారి 21F' విజయవంతం కావడంతో, ఆ సెంటిమెంట్ తో ఈ సినిమాలో టైటిల్ లోను నెంబర్ ఉండేలా సూర్యప్రతాప్ చూసుకున్నాడని చెప్పుకుంటున్నారు.
విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమా, నిఖిల్ కి మరో హిట్ ఇవ్వడం ఖాయమనే ఆభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ సందర్భంగా హీరో నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ క్యూట్ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన కొత్త సినిమా '18 పేజీస్' షూటింగ్ ప్రారంభమైన సమయంలో చోటుచేసుకున్న ఈ వీడియోను స్వయంగా హీరో నిఖిల్ తన మోబైల్ ఫోన్ తో చిత్రీకరించారు. ఈ సినిమా కథను సుకుమార్ అందించారు.
ఈ సందర్భంగా తన మనవరాలు (బన్నీ కూతురు) అర్హను కూడా అల్లు అరవింద్ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'నువ్వు నన్నేం చేస్తావో చూడాలని ఉందట.. ఒక్క సారి చూపించు వాళ్లకి' అని అల్లు అరవింద్ ఆమెను అడగ్గా, తన తాత బుగ్గలు లాగి ముద్దు పెట్టుకుంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన నిఖిల్.. 'ఆమె మా చీఫ్ గెఫ్ట్.. స్పెషల్ గెస్ట్' అని వ్యాఖ్యానించాడు. ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 ఆర్ట్స్ పతాకంపై బన్నీవాస్ నిర్మాతగా రూపుదిద్దుకుంటుంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. '18 పేజీస్' టైటిల్ పోస్టర్‌ను నిఖిల్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
If you enjoyed this Post, Sign up for Newsletter
(And get your daily news straight to your inbox)
Tags : Allu Arha 18 Pages Allu Aravind Nikhil Sukumar Surya Pratap Gopi Sundar Bunny Vas GA2 banner tollywoodOther Articles
![]()
‘ఆ’ విషయంలో తగ్గేదేలే అంటున్న విశ్వక్ సేన్
May 21 | యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ... Read more
![]()
‘‘నన్ను మన్నించండీ..’’ ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ భావోద్వేగ లేఖ..
May 21 | తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా... Read more
![]()
బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్న ‘ది వారియర్’ సాంగ్
May 21 | రామ్ హీరోగా లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన... Read more
![]()
ఎఫ్-3 చిత్రం చూసి నవ్వకుండా ఉండలేరు: దేవిశ్రీప్రసాద్
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
![]()
పవన్ కల్యాణ్ పాత్రపై గబ్బర్ సింగ్ డైరెక్టర్ క్లారిటీ
May 21 | పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో పవన్ సరసన నాయికగా... Read more