Lucky chance to Palasa 1978 director Karuna 'పలాస 1978' దర్శకుడు కరుణకుమార్ కు లక్కీఛాన్స్

Palasa 1978 director karuna kumar already has a second film lined up

Rakshit, Raghu Kunche, preview, Palasa 1978, Palasa, nakshatra, Karuna Kumar, Allu Aravind, advance cheque, bunny vas, Tollywood

Director Karuna Kumar is making his debut tomorrow when his first film Palasa 1978 will hit screens. Karuna has already bagged his second film with none other than Allu Aravind. The producer was so impressed by the film after catching a screening, that he immediately brought the director on-board and even handed him an advance cheque for his next.

'పలాస 1978' దర్శకుడు కరుణకుమార్ కు లక్కీఛాన్స్

Posted: 03/05/2020 05:59 PM IST
Palasa 1978 director karuna kumar already has a second film lined up

తన దర్శకత్వంతో రూపోందించిన తొలి చిత్రం విడుదలకు ముందే కొత్త దర్శకుడికి రెండో చిత్రం ఆఫర్ నడుచుకుంటూ రావడమంటే ఎంతో అరుదు. కానీ ఇలాంటిది ఓ దర్శకుడికి వచ్చింది. సర్లే.. ఎవరో చిన్నా చితక నిర్మాతలు అనుకుంటే.. కాదు.. ఏకంగా మెగా ప్రోడ్యూసర్ గా ఖ్యాతిగాంచిన టాప్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ నుంచే దర్శకుడు అడ్వాస్ చెక్ ను అందుకున్నాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు.. ఎమా కథ.. కమామిషు అంటే..

రక్షిత్ .. నక్షత్ర అనే కొత్త హీరో హీరోయిన్లతో దర్శకుడు కరుణ కుమార్ 'పలాస 1978' సినిమాను రూపొందించాడు. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమాను , ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ను .. బన్నీ వాసును ఆహ్వానించి ఈ సినిమా ప్రివ్యూ షో ను చూపించారు. ప్రివ్యూ షో చూసిన అల్లు అరవింద్ .. దర్శకుడు కరుణ కుమార్ ను అభినందించారు.

యథార్థ సంఘటనల ఆధారంగా ఆయన ఈ సినిమాను ఎంతో సహజంగా చిత్రీకరించాడంటూ ప్రశంసించారు. కరుణ కుమార్ కి మంచి భవిష్యత్తు ఉందంటూ మెచ్చుకున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఆయనతో ఒక సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు అడ్వాన్స్ గా కరుణ కుమార్ కి తన చేతుల మీదుగా చెక్ ను అందించారు. దాంతో కరుణ కుమార్ తన రెండవ సినిమాను గీతా ఆర్ట్స్ 2లో చేయడమనేది ఖరారైపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Palasa 1978 Movie  Karuna Kumar  Allu Aravind Movie  Advacne cheque  preview  tollywood  

Other Articles

Today on Telugu Wishesh