యువ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా రూపోందిన ‘ఒరేయ్ బుజ్జిగా చిత్రం ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇవాళ చిత్ర టీజర్ ను విడుదల చేసింది. కేకే రాధామోహన్ నిర్మాణంలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత సమకూర్చుతున్నారు.
‘అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా.. రిక్వెస్ట్ పెట్టగానే చూస్తారు.. యాక్సెప్ట్ చేయడానికి మాత్రం రెండు రోజులు చేతులు పిసుక్కుంటారు’ అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ‘అసలు బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి? ఒక ఫ్లిఫ్ కార్ట్, ఒక స్విగ్గీ, ఒక ఓలా, ఒక బుక్ మై షో, ఒక క్రెడిట్ కార్డ్’ అని హెబా పటేల్ చెప్పే డైలాగ్ బాగుంది. అలాగే మందుందా? అని హీరోయిన్ అడిగిన ప్రశ్నకి నా దగ్గర పెద్దగా బ్రాండ్స్ లేవమ్మా.. అని నరేష్ చెప్పే డైలాగ్. దానికి సమాధానంగా భాదకి బ్రాండ్స్‌తో పనేంటి డాడీ అని చెప్పే డైలాగ్ మరింత ఎంటర్‌టైనింగ్‌గా ఉంది.
పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా సాగిన ఈ టీజర్‌లో కామెడీ అండ్ రొమాన్స్‌తో పాటు డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక రాజ్ తరుణ్ కూడా ఫుల్ హుషారుగా కనిపించాడు. మొత్తంగా ఒక నిమిషం ఇరవై సెకండ్ల విడివిగల ఈ టీజర్ పక్కా యూత్ ఎంటర్ టైనర్‌గా సినిమాపై అంచనాలని పెంచింది. ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలకాబోతుంది. ఈ చిత్రంలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషించారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more