Vijay Devarakonda files complaint against impostor విజయ్ దేవరకొండను వదలనీ సైబర్ నేరగాళ్లు..

Vijay devarakonda files complaint against impostor

Vijay Devarakonda, complaint, cyber crime, Police, Fake social media accounts, Facebook, dubbing artiste, Cyber Crimes ACP, KVM Prasad, Hyderabad, Tollywood

Popular Tollywood actor Vijay Devarakonda’s manager filed a complaint with the Hyderabad cyber crime police stating that an unknown person pretending to be the actor on Facebook and WhatsApp was asking women for sexual favours.

విజయ్ దేవరకొండను వదలనీ సైబర్ నేరగాళ్లు..

Posted: 03/04/2020 07:54 PM IST
Vijay devarakonda files complaint against impostor

సోషల్ మీడియా వల్ల రోజురోజుకీ మోసాలు, దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి. సెలబ్రిటీల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి అమాయకులను మోసం చేసే కేటేగాళ్ల సంగతి చెప్పక్కర్లేదు. గతంలో ఇలాంటి ఉదంతాలు చాలానే చూశాం. తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది.

వివరాళ్లోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ పేరుతో కొన్ని రోజులక్రితం నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచిన వ్యక్తి.. మొదట తనకు డబ్బింగ్‌ చెప్పే ఆర్టిస్టుతో చాటింగ్‌ చేయాలని, వివరాలవీ ఓకే అనుకున్నాక అతడు ఓకే చేస్తే  నేను చాటింగ్‌ చేస్తానంటూ విజయ్‌ దేవరకొండలా సదరు మోసగాడు చెప్తున్నాడు. సెకండ్ స్టెప్‌గా తన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అంటూ ఓ ఫోన్‌ నంబర్‌ ఇస్తున్నాడు.

దీంతో వాట్సాప్‌ ద్వారా చాటింగ్‌ చేస్తున్న యువతులతో అతగాడు ప్రేమ, పెళ్లి, సహజీవనం అంటూ ముచ్చట్లు పెడుతున్నాడు. ఈ వ్యవహారాన్ని ఇటీవల కొందరు సన్నిహితులు విజయ్‌ దేవరకొండ దృష్టికి తీసుకెళ్లారు. సదరు మోసగాడికి చెందిన వాట్సాప్‌ నంబర్‌ సైతం అందించారు. దీంతో అసలు నిజం తెలుసుకోవాలని భావించిన ఆయన తన వద్ద సహాయకుడిగా పని చేసే గోవింద్‌ను యువతి మాదిరిగా ఆ నంబర్‌తో చాటింగ్‌ చేయమని చెప్పగా తన పేరు హేమ అంటూ పరిచయం చేసుకున్న గోవింద్‌ ఆ మోసగాడితో చాటింగ్‌ చేసాడు..

తాను విజయ్‌ దేవరకొండ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ని అంటూ పరిచయం చేసుకున్న అతగాడు అందరు అమ్మాయిలకు చెప్పే కథలే ఇక్కడా చెప్పాడు. కట్ చేస్తే.. మోసగాడు దాదాపు పది మంది యువతులను ఇలానే మోసం చేస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. దీంతో మంగళవారం గోవింద్‌తో పాటు విజయ్‌ దేవరకొండ మేనేజర్‌ సైతం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles