nagarjuna bangaraju movie to go on sets from june బంగార్రాజుకు లైన్ క్లియర్.. పట్టాలెక్కనున్న ప్రాజెక్టు

Hero nagarjuna gives green signal to bangaraju movie shooting strats in june

Bangaraju Movie, NagaChaitanya, Nagarjuna, ramya krishnan, Rashmika Mandanna, kalyan krishna, telugu movies, tollywood news, Entertainment, latest Cinema news, tollywood

Amid busy works, the next project of Hero Nagarjuna is being delayed. But now the Hero gives green signal to the director Kalyan Krishna, by which the movie is all set to go on to sets from june.

బంగార్రాజుకు లైన్ క్లియర్.. పట్టాలెక్కనున్న ప్రాజెక్టు

Posted: 02/29/2020 06:38 PM IST
Hero nagarjuna gives green signal to bangaraju movie shooting strats in june

'నాగార్జున హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. విలేజ్‌ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున కనిపించిన బంగార్రాజు పాత్రకు సూపర్బ్ రెస్సాన్స్ వచ్చింది. నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒక‌టి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2016 సంక్రాంతి కానుకగా విడుదలై అశేష తెలుగు ప్రజానికాన్ని విశేషంగా ఆకట్టుకుంది. కట్ చేస్తే… నాలుగేళ్ల విరామం అనంతరం ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి కొనసాగింపు చిత్రం తెరకెక్కనుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఆ సినిమాలో నాగ‌ర్జున‌ పోషించిన ‘బంగార్రాజు’ పాత్రకి మంచి ఆదరణ లభించింది.

దాంతో ఆ పాత్రనే టైటిల్ గా సెట్ చేసుకుని, అదే కల్యాణ్ కృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లాలని నాగార్జున నిర్ణయించుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు లేట్ అవుతూ వచ్చింది. తాజాగా పరిస్థితులన్నీ అనుకూలంగా మారడంతో, జూన్ నుంచి ఈ సినిమాను పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణనే కనిపిస్తుంది. చైతూ జోడీగా రష్మికను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అన్నపూర్ణ బ్యానర్లో ఇటు నాగార్జునకి .. అటు చైతూకి హిట్లు ఇచ్చిన కల్యాణ్ కృష్ణ, ఈ ఇద్దరికీ కలిపి భారీ విజయాన్నే అందిస్తాడేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles