Sree Vishnu's first-look from Raja Raja Chora ‘రాజ రాజ చోర’ నుంచి శ్రీ విష్ణు ఫస్ట్ లుక్..

Sree vishnu first look from raja raja chora

Sree Vishnu, happy birthday, Raja Raja Chora, first look, Sunaina, Vivek Sagar, People Media Factory, Abhishek Agarwal Arts, Hasith Goli,, Movies, Entertainment, Tollywood

Reputed film production houses, People Media Factory and Abhishek Agarwal Arts together are producing a film with young hero Sree Vishnu. The film titled 'Raja Raja Chora' is being helmed by debut director Hasith Goli.

‘రాజ రాజ చోర’ నుంచి శ్రీ విష్ణు ఫస్ట్ లుక్..

Posted: 02/29/2020 08:51 PM IST
Sree vishnu first look from raja raja chora

యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా.. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సునయన కథానాయిక. హీరో శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా శనివారం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హసిత్ గోలి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీ విష్ణు, హసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాతలు తెలిపారు

‘‘ హీరో శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పేరును, తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేయటం ఆనందంగా ఉంది.  ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది’’ అని తెలిపారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా సునయనా ఫిక్స్ అయ్యారని సమాచారం. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చుతుండగా, చాయాగ్రహనం బాధ్యతలను వేదరామన్ నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh