Nithiins Bheeshma enters feild of profits లాభాల బాటలో దూసుకుపోతున్న నితిన్ ‘భీష్మ’

Nithiins bheeshma enters feild of profits crossing breakeven

Bheeshma, nithin bheeshma, Nithiin, Rashmika Mandanna, Venky Kudumula, Suryadevara Naga Vamsi, Mahati Swara Sagar, Tollywood, Entertainments, Movies

Young Hero Nithiin's Bheeshma is minting money at the box office, the movie has already reached the break even point, and is running into the feild of profits, the producers and distributors are pleased in this regard.

లాభాల బాటలో దూసుకుపోతున్న నితిన్ ‘భీష్మ’

Posted: 02/27/2020 09:02 PM IST
Nithiins bheeshma enters feild of profits crossing breakeven

హీరో నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రం అంచనాలకు మించి బాక్కాఫీసు వద్ద దూసుకుపోతొంది. ఈ సినిమా విజయం సాధించడంతో పాటు అటు నితిన్ పెళ్లి కూడా ఫిక్స్ కావడంతో ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చక్కని సందేశం పంపారు. ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భీష్మ’.. విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, ఆ తరువాత కూడా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. దీంతో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను టచ్ చేసిన సినిమా ఇక లాభాల బాటలో పరుగులు పెడుతోందని ట్రేడ్ వర్గాల బొగట్టా.

దేశ వ్యాప్తంగా 6 రోజుల్లో ఈ సినిమా 28.70 కోట్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 41.30 కోట్లను రాబట్టిన ఈ సినిమా, 50 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా, యూఎస్ లోను తన దూకుడు కొనసాగిస్తోంది. దగ్గరలో గట్టి పోటీనిచ్చే సినిమాలేవీ లేకపోవడం వలన, ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. కామెడీ .. సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ప్రధానమైన పాత్రను పోషించాయనీ, ఈ కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles