playback singer Sushmitha Raje commits suicide శాండిల్ వుడ్ యువగాయని ఆత్మహత్య..

Sandalwood playback singer sushmitha raje commits suicide

Sushmitha Raje, playback singer, Sharath Kumar, software engineer, Nagarabavi, Meenakshi, dowry harassment, Karnataka, Sandalwood, Crime, Tollywood, Entertainment, movies

Alleged dowry harassment pushed a 26-year-old playback singer to suicide. She hanged herself in her mother’s house in Malagala near Nagarabavi. Sushmitha Raje left a suicide note accusing her husband Sharath Kumar as responsible for her death and forwarded it to her brother over WhatsApp.

శాండిల్ వుడ్ లో విషాదం.. యువగాయని బలవన్మరణం..

Posted: 02/18/2020 01:05 PM IST
Sandalwood playback singer sushmitha raje commits suicide

శాండిల్ వుడ్లో విషాదం చోటుచేసుకుంది. యువగాయని సుస్మిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  ‘హళు తూప్ప’, ‘శ్రీసామాన్య’ చిత్రాల్లో పాటలు పాడి అలరింపజేసిన ఆమె.. ఇటు టీవీ సీరియళ్లలో గాత్రం అందిస్తూ సింగర్ గా ఎదుగుతున్న క్రమంలో బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. బెంగళూరులో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్న శరత్ అనే యువకుడితో సుస్మితకు ఏడాది కిందట వివాహం జరిగింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అయితే పెళ్లైన కొన్ని రోజుల వరకు సవ్యంగానే వున్న తన కాపురంలో అదనపు కట్నం అగ్గిని రాజేసింది. అవి క్రమంలో సుస్మిత బలవన్మరణానికి కూడా కారణమయ్యాయి. పెళ్లైన రెండు నెలల నుంచి వారి కాపురం సజావుగా సాగింది లేదు. ఈ క్రమంలో భర్తతో పాటు అమె కుటుంబసభ్యులు కూడా సుస్మితను అదనపు కట్నం కోసం వేధించారు. ఈ క్రమంలో వీరి మధ్య గత ఆదివారం గొడవ జరిగింది. దీంతో ఆమె భర్త ఇంటి నుంచి బెంగళూరులోని నగరబావిలో వున్న తన పుట్టింటికి చేరింది.

తన మెట్టినింటిలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర మనస్థాపానికి చెందిన సుస్మిత.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు అమె తన తల్లికి, సోదరుడికి వాట్సాఫ్ లో సూసైడ్ నోట్ పంపింది. తన భర్త శరత్ ను, అతని కుటుంబసభ్యులను, తల్లిని, చెల్లిని, చెల్లి అత్తను.. ఎవరినీ వదలొద్దని పేర్కొంది. మెట్టినింట్లో తాను ప్రతినిథ్యం అదనపు కట్నం వేధింపులు ఎదుర్కోన్నానని, ఈ క్రమంలో తాను ఆ ఇంట్లో చనిపోయినా.. శాంతి చేకూరదని పుట్టింటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని అమె పేర్కోంది.

తన మెట్టినింట్లో అకారణంగా చేయిచేసుకున్నారని, అందరిముందు తిట్టడంతో పాటు తనను తన పుట్టింటివారిని అవమానించారని.. తనను క్షోభపెట్టే చర్యలకు పాల్పడుతూ రాక్షసానందం పొందారని ఆరోపించింది. అత్తింటివారి ఆగడాల గురించి భర్తకు చెప్పినా అతను కూడా వారికే వంతపాడేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, తమ కుమార్తె ఆత్మహత్యపై సుస్మిత తల్లిదండ్రులు బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో హాళుతుప్ప, శ్రీసామాన్య అనే సినిమాల్లో పాటలు పాడిన సుస్మిత, అనేక సీరియళ్లలోనూ గాత్రమాధుర్యాన్ని పంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushmitha Raje  playback singer  Sharath Kumar  dowry harassment  suicide  Karnataka  Sandalwood  Crime  

Other Articles