ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్ రోల్ ను పోషించి తెరంగ్రేటం చేసిన చిత్రం ‘స్వేచ్ఛ’ టీజర్ ను ఇవాళ చిత్రయూనిట్ విడుదల చేసింది. హాస్యనటుడు చమ్మక్ చంద్ర, జబర్థస్ బాలనటి యోధ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం ఫ్రిబవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెపీఎన్. చౌహన్ దర్శకత్వంలో సరస్వతి డెవలపర్స్, లచ్చురాం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఆంగోత్ రాజునాయక్ దీన్ని నిర్మించారు. అడపిల్లల పట్ల సభ్యసమాజంలో కొనసాగుతున్న వివక్షను ఈ చిత్రం ఎత్తిచూపుతుంది.
మేక పిల్లైతే కోసుకుని తింటా.. ఆడపిల్ల పిల్లైతే అమ్ముకుని తింటా అన్న డైలాగ్ హృదయాలను ద్రవింపజేస్తోంది. ఇక ఈ ట్రైయిలర్ లో ఆడపిల్ల గొంతులో వడ్లు పోసే సన్నివేశం కూడా వారిపై జరిగే దారుణాలకు దర్పణం పడుతుంది. ఇక ఈ చిత్రంలో బంజారా వర్గానికి చెందిన ప్రజలు, వారి సంప్రదాయాలు, సంస్కృతులకు కూడా ఈ చిత్రం అద్దం పడుతుంది. ఈ చిత్రంలో మంగ్లీ (సత్యవతి) లేడి డాన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
చిన్నతనంలో అమ్మకానికి గురై అభాగ్యురాలు.. ఎలా బతికింది? ఆమె ఏం సాధించింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. సెంటిమెంట్, వినోదం మేళవింపుతో రూపొందిన ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చడంతో పాటు చిత్రంలో ఓ పాత్రలో కూడా మెరిసాడు సంగీత దర్శకుడు భోలో షావలి తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కేపీఎన్ చౌహాన్ తెరకెక్కించారు. అద్భుతమైన కథాంశంతో రూపోందిన ఈ చిత్రంలో చమ్మక్ చంద్ర ముఖ్యపాత్రలో నటించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more