Actor Uday Kiran dies of cardiac arrest యువనటుడు ఉదయ్‌ కిరణ్‌ హఠాన్మరణం

Actor nanduri uday kiran dies of cardiac arrest

Tollywood Actor, Nanduri Uday Kiran, Uday Kiran death, Uday Kiran cardiac arrest, Uday Kiran kakinada, Uday Kiran no more, Uday Kiran 'Pararey’, Uday Kiran ‘Friends Book’, Tollywood, Entertainment, movies

Telugu actor Nanduri Uday Kiran, who acted in lead roles in a couple of movies, died of cardiac arrest at his home town Kakinada. He reportedly breathed his last at a local hospital late on Friday, according to reports.

గుండెపోటుతో యువనటుడు ఉదయ్‌ కిరణ్‌ హఠాన్మరణం

Posted: 02/15/2020 07:53 PM IST
Actor nanduri uday kiran dies of cardiac arrest

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ (34) హఠాన్మరణం చెందాడు. యువనటుడు ఒక్కసారిగా మరణించాడన్న వార్తను టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. పరారే, ఫ్రెండ్స్‌బుక్ సినిమాల్లో హీరోగా ఉదయ్‌కిరణ్‌ నటించారు. పలు తమిళ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. ఆ తరువాత కొంతకాలం పాటు మానసికంగా కూడా చికిత్స చేయించుకున్నాడు.

శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటుతో అతడు మరణించాడు. ఉదయ్‌కిరణ్‌ పార్థివ దేహానికి పలువురు రాజకీయ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్నారు. 2016లో జూబ్లీహిల్స్‌లోని ఓవర్ ద మూన్ పబ్‌లో గొడవ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఉదయ్‌ కిరణ్‌ పలు నేరాలకు పాల్పడినట్టు అప్పట్లో పోలీసులు గుర్తించారు.

డ్రగ్స్ కేసులోనూ అరెస్టై జైలు జీవితం గడిపాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కాకినాడలో మహిళను మోసం చేసిన కేసులోనూ అరెస్టయ్యాడు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 59లోని నందగిరిహిల్స్‌లో ఇంటి యాజమానిపై దౌర్జన్యం చేయడంతో 2018లో క్రిమినల్‌ కేసు పెట్టారు. ఇలా పలువురిని మోసం చేయడంతో అతడిపై పలుమార్లు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అయితే ఉదయ్ కిరణ్ మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు ఆయనకు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చికిత్స అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Young tollywood Actor  Nanduri Uday Kiran  death  cardiac arrest  kakinada  Tollywood  

Other Articles