SS Rajamouli's RRR gets a new release date అర్ఆర్ఆర్ తాజా అప్ డేట్: అభిమానులను నిరాశ

Ss rajamouli s period epic rrr release date postpones by six months

RRR, RRR release date, RRR new release date, SS Rajamouli, Jr NTR, Ram Charan, RRR January 8 2021, RRR, ajay devgn, RRR shooting, ajay devgn in RRR, ajay devgn pics, Ram charan, NTR, Tarak, Rajamouli, Tollywood, movies, entertainment

Director SS Rajamouli is known for taking his sweet time to complete his films. It is the case with his upcoming film RRR, which features Ram Charan and Jr NTR in the lead roles. The film was supposed to hit the theatres on July 26, 2020, but it has been postponed.

అర్ఆర్ఆర్ తాజా అప్ డేట్: అభిమానులను నిరాశ

Posted: 02/05/2020 07:25 PM IST
Ss rajamouli s period epic rrr release date postpones by six months

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ పై తాజాగా ఓ అప్ డేట్ అభిమానులను నిరాశకు గురిచేసింది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘#RRR’పై అంచనాలు కొత్తేమీ కాదు. ఇలా అని రాజమౌళి అనుకున్న క్షణం నుంచి అంచనాలు పెరగడం ఈ చిత్రానికి వున్న స్పెషాలిటీ. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ మారుతుందంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయమై వచ్చిన లేటెస్ట్ అప్ డేట్ అభిమానులను నిరాశకు గురిచేసింది.

ఈ ఏడాది జులై 30న విడుదల చేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ ఆ సమయం కాస్త ఆలస్యమై దసరా నేపథ్యంలో విడుదలకు సన్నాహలు చేస్తున్నామని మరో వార్త అందింది. అయితే ఇవన్నీ ఊహాగానాలే అనుకుంటున్న సమయంలో చిత్రబృందం అభిమానులకు ఓ సందేశం ఇచ్చింది. సినిమా విడుదల తేదీని మారుస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మల్టీస్టారర్ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.? అంటూ ఎదురుచూస్తన్న అభిమానులు నిరాశకు లోనయ్యారు.

"మీరు మా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు.. సెట్స్‌ మా కష్టాన్ని మరిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సినిమాను తీర్చిదిద్దడానికి సమయాన్ని లెక్కచేయకుండా కష్టపడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయాలని... విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం. ఇది మీ అందరికీ నిరాశకు గురిచేస్తుందని తెలుసు. కానీ ఈ సమయంలో మీకు మేలైన సినిమా అందించడానికి మరింత కృషి చేస్తాం. సంక్రాంతి కానుకగా వచ్చేఏడాది జనవరి 8న సినిమా మీ ముందుకు తీసుకొస్తాం. దీనికి చాలా సమయం ఉందని తెలుసు. అప్పటివరకు మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఇస్తుంటాం " అంటూ చిత్రబృందం సందేశాన్ని పెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RRR  RRR release date  RRR new release date  SS Rajamouli  Jr NTR  Ram Charan  RRR January 8 2021  Tollywood  

Other Articles