సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైయిలర్ ఇవాళ విడుదలైంది.
విజయ్ దేవరకొండ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో నేచురల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. రాశీ ఖన్నా, ఎజబెల్లా, క్యాథరీన్లతో తన స్టైల్లో రొమాన్స్ చేస్తూనే ఇష్టంలేని భార్యతో కాపురం చేసే భర్తగా కనిపించాడు. ‘ఈ ప్రపంచంలో నిస్వార్థమైంది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ప్రేమలో కూడా నేను అనే రెండు అక్షరాలు సునామీనే రేపగలవు ఐ వాటెండ్ టు బి దిజ్ వరల్డ్ ఫేమస్ లవర్’ ‘వేర్ యు బార్న్ బ్యూటిఫుల్ అర్ యు గ్రో అప్ టు బి బ్యూటిఫుల్’ ‘మీ అడోళ్లకు అస్సలు అగదానే.. బట్ట కొంటె వంటి మీద ఏసుడేనా..’ అంటూ తన ప్రేమలోనే కాదు తన బాషలోనూ రొమాంటిక్ గా నాలుగు వేరియేషన్స్ చూపించాడు విజయ్.
అదే సమయంలో ప్రేమ విఫలమైనవాడిగా, లేక ప్రేమలో గాయపడ్డవాడిగా కూడా వేరియేషన్స్ చూపుతూ అద్భుత నటనను ప్రదర్శించాడు విజయ్. ‘ఆర్ యు మ్యాడ్ పెళ్లంటే జోకా.? నీ అవ్వ తంతే కిటికిల పడ్తవ్ మరి.. నా ముక్కు, మూతి, తోలు మారిపోయిందా.? మీ ఇంట్ల కొట్టుకోరా.. భార్యభర్తలు కొట్టుకోరా.? నా గుండెకు తగిలిన దెబ్బకి ఆ పెయిన్ తెల్వకుండా ఉండాలంటే.. బేసికల్ గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలే.. నౌ ఐ లిటరల్లీ ఫీల్ ద పెయిన్’ అంటూ తనలోని బాధను చాలా అవేదనాభరితంగా వ్యక్తపర్చాడు.
ఐశ్వర్య రాజేష్ డీ గ్లామర్ రోల్లో సహజంగా కనిపించగా.. ‘జిందగి ఏమన్న కమ్మగుందా మామ..’ అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. పెళ్లికిముందు రాశీ ఖన్నా, ఎజబెల్లాలతో ప్రేమాయణం నడిపిన విజయ్, పెళ్లి తర్వాత కేథరిన్‌తో ప్రేమలో పడతాడని తెలుస్తుంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ఫిబ్రవరి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన బొగ్గుగని మణిరా అన్న పాటతో పాటు ట్రైలర్ లోని ఆర్ఆర్ కూడా ఆకట్టుకుంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more