సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రీలుక్‌లో మత్స్యకారుడి గెటప్‌లో మాస్ లుక్‌తో కనిపించి వైష్ణవ్ సినీ ప్రియులను మెప్పించారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
ఇందులో వైష్ణవ్ మాస్, లవర్ బాయ్ లుక్ లో కనిపించారు. ఈ సినిమాలో వైష్ణవ్ కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతోపాటు సుకుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమా పూర్తవుతుండగానే వైష్ణవ్ తేజ్ మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. 'ఓ బేబీ' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నందినీ రెడ్డి, ఒక కథ వినిపించగా వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అశ్వనీదత్ కుమార్తెలు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధిచిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి వుంది.
(And get your daily news straight to your inbox)
Jul 06 | ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు మృతిపట్ల సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గౌతమ్ రాజు గారి లాంటి గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరమని... Read more
Jul 06 | ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూశారు. గత కొంకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జీ అయ్యారు. అయితే ఒక్కసారిగా... Read more
Jul 04 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా... Read more
Jul 04 | నందమూరి హీరో కల్యాణ్‌రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బింబిసార. మగధ రాజ్యాన్ని పరిపాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథతో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ఠ్ దర్శకత్వం... Read more
Jul 04 | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలుగు సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త... Read more