disco raja day 4 box office collections రవితేజ డిస్కోరాజా: 4 రోజుల కలెక్షన్స్..

Disco raja day 4 box office world wide share report

Ravi Teja, Disco Raja, Disco Raja day 4 collections, Disco Raja box office collections, Payal Rajput Disco Raja, Nabha Natesh Disco Raja, Tanya Hope Disco Raja, Disco Raja movie relese date, film updates, Bobby Simha, Ram Tulluri, SRT Entertainments, tollywood news, Movies, Entertainment

Ravi Teja's film “Disco Raja” directed by VI Anand and produced by Ram Talluri under the SRT Entertainment banner has released on 24th of January 2020 is performing decently and able to make net collection of Rs 11.3 crores from all over the country. The film may earn Rs 2 crores on its fourth day totalling to 13.3 crores.

రవితేజ డిస్కోరాజా: 4 రోజుల కలెక్షన్స్..

Posted: 01/27/2020 06:19 PM IST
Disco raja day 4 box office world wide share report

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన డిస్కోరాజా మూవీ ఫస్ట్ వీకెండ్ డీసెంట్‌గా ముగించింది. జనవరి 24న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాబట్టనప్పటికీ.. ఫర్వాలేదనిపించింది. రామ్ తుళ్లూరి నిర్మాతగా ఎస్ఆర్టీ బ్యానర్ పై నిర్మించిన డిస్కోరాజా సేఫ్ జోన్ లోకి రావాలంటే మాత్రం ఇంకొన్ని రోజులపాటు డీసెంట్ రన్ కొనసాగించక తప్పదు.

పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రవితేజ నటన బాగుందని టాక్ వచ్చినా.. టాక్ మేరకు కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరం వుందంటున్నారు ట్రేడ్ పండితులు. తొలి షోతోనే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మూడు రోజుల పాటు అన్ని ఏరియాల్లోనూ డీసెంట్‌గా ప్రదర్శించబడింది. ఈ మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.88 కోట్లు రాబట్టాడు రవితేజ. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 6.86 కోట్లు వసూలు చేశాడు ఈ డిస్కో రాజా.

తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 4.1 రూపాయల వసూళ్లను రాబట్టింది. రెండో రోజున అది రూ.3.7 కోట్లు, మూడో రోజున రూ.3.5 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక నాలుగో రోజున రూ.2 కోట్ల వరకు వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. దీంతో మొత్తంగా రూ. 13.5 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.10 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 19.20 కోట్లు ప్రి-రిలీజ్ బిజినెస్ సాగించిన ఈ చిత్రం.. ఈ క్రమంలో బ్రేక్ ఈవెన్ పాయింట్ కు చేరుకోవాలంటే.. మరో వారం రోజుల పాటు మరో పది కోట్ల రూపాయల బిజినెస్ చేస్తే చిత్రం లాభాల్లోకి చేరకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles