Allu Arjun and Sukumar starrer gets a title? బన్ని-సుకుమార్ చిత్ర టైటిల్ పై చిత్రయూనిట్ క్లారిటీ

Aa 20 sukumar allu arjun movie title makers open up on reports

allu arjun, sukumar, rashmika mandanna, Bunny, smuggling, sheshachalam, film unit, mytri movie makers,, tollywood, movies, Entertainment

Creative director Sukumar is making his 20th film in Allu Arjun’s career. Crazy heroine Rashmika Mandanna is teaming up with Bunny for the first time.

బన్ని-సుకుమార్ సినిమా టైటిల్ శేషాచలంపై క్లారిటీ..

Posted: 01/20/2020 09:57 PM IST
Aa 20 sukumar allu arjun movie title makers open up on reports

‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. అయితే ఈ సినిమా టైటిల్‌ గురించి ఎన్నో పేర్లు ప్రచారంలో ఉన్నాయి.  ‘శేషాచలం’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ సినిమా టైటిల్‌ గురించి ఓ ట్వీట్‌ పెట్టింది. బన్నీ సినిమా టైటిల్‌ గురించి వస్తోన్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ‘అల్లుఅర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో AA20 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. కొన్ని వెబ్‌సైట్లలో సినిమా టైటిల్‌ గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సరైన సమయంలో తప్పకుండా మేము టైటిల్‌ను ప్రకటిస్తాం. ధన్యవాదాలు.’ అని మైత్రి మూవీ మేకర్స్‌ పేర్కొంది.

ఇందులో బన్నీకి జంటగా క్రేజీ హీరోయిన్ రష్మిక మందన కనిపించనున్నారు. మరోవైపు బుల్లితెర వ్యాఖ్యాత, నటి అనసూయ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించనున్నారు. ఇప్పటికే సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి ప్రేక్షకులను అనసూయ మెప్పించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  sukumar  rashmika mandanna  Bunny  smuggling  sheshachalam  film unit  mytri movie makers  tollywood  

Other Articles