NTR Teasing Paparazzi at Airport ఫోటోగ్రాఫర్ ను దగ్గరకు పిలిచి.. ఎన్టీఆర్ పంచులు..

Tarak s funny banter with a photographer at the airport

RRR, Ram charan, Rajamouli, Ntr at Mumbai Airport, Mumbai airport, Jr NTR, Jr NTR funny banter, Jr NTR funny banter with a photographer, Jr NTR photographer, Jr NTR airport, NTR Photographer, ad shoot, tollywood, movies, entertainment

NTR flew down to Hyderabad along with his staff and a photographer tried to take pictures of him even at that odd hour. Tarak asked him sarcastically, “Do you live here? Food, bath and everything, here?” After speaking to him, he left in the place in his vehicle.

ఫోటోగ్రాఫర్ ను దగ్గరకు పిలిచి.. ఎన్టీఆర్ పంచులు..

Posted: 01/20/2020 08:45 PM IST
Tarak s funny banter with a photographer at the airport

ఎస్‌ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ షూటింగ్లో బిజీగా మారాడు. ఈ తరుణంలో తన మోగా పవర్ స్టార్ రాంచరణ్ అతనిపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఓ ఫైర్ క్రాకర్ అని.. ఆయన లోకేషన్ లో లేకపోతే తనకు ఏమీ తోచదని చెప్పాడు. అయితే అలాంటి ఫైర్ క్రాకర్ ఎవరినైనా గుర్తుపెట్టుకుని మరీ ఆటపట్టిస్తే.. అది కూడా గోప్పే. ఎందకంటారా.? ప్రతి రోజు బిజీ లైఫ్ లో ఎంతోమందిని చూసే సెలబ్రిటీలు తమను గుర్తుపెట్టుకోవడం నిజంగా అదృష్టమేనని అనుకోవాల్సిందే. ఇప్పుడలాంటి అనుభవమే ఓ ఫోటోగ్రాఫర్ కు ఎదురైంది.

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా బయట మాత్రం ఎంతో సరదాగా కనిపిస్తుంటారు ఎన్టీఆర్. తన చుట్టూ ఉండే వాళ్లను ఆటపట్టిస్తూ అందర్నీ నవ్విస్తుంటారు. అయితే, తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఈసారి ఎన్టీఆర్‌.. ఓ ఫొటోగ్రాఫర్ ను గుర్తుపట్టి మరీ పంచులు వేశారు. ఓ వాణిజ్య ప్రకటన నిమిత్తం ముంబయి వెళ్లిన ఎన్టీఆర్‌ తిరుగు ప్రయాణంలో హైదరాబాద్లోని శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టులో ఆయన నడుచుకుంటూ వస్తుండగా అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్‌ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు.

ఫొటోగ్రాఫర్ గమనించిన ఎన్టీఆర్‌.. ఆ ఫొటోగ్రాఫర్ ను దగ్గరికి పిలిచి.. ‘నువ్వు ఇక్కడే ఉంటావా..? తిండి, స్నానం అన్నీ ఇక్కడేనా..?’ అని ఆటపట్టించాడు. దీంతో అక్కడున్న వాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారు. ఫొటోగ్రాఫర్‌ సైతం తనను ఎన్టీఆర్‌ గుర్తుపట్టి మరీ మాట్లాడటంతో ఉబ్బితబ్బిబయ్యాడు. గతంలోనూ ఎన్టీఆర్‌ ఎయిర్ పోర్టు వెళ్లినప్పుడు ఆ ఫొటోగ్రాఫర్‌ ఫొటోలు తీసిన విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నాడు. మళ్లీ అతనే విమానాశ్రయంలో కనిపించడంతో ఇలా ఆటపట్టించాడు. ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఈ ఏడాది అక్టోబర్లో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh