Allu Arvind to receive “Champion of Change” award అల్లు అరవింద్ కు ప్రతిష్టాత్మక అవార్డు..

Famous telugu producer allu arvind to receive champion of change award

Allu Arvind, Telugu movies, Hemant Soren, Politician, Champion of Change, Pranab Mukherjee, Indian cinema, justice K.G Balakrishnan, former Supreme Court judge, Justice Gyan Sudha Misra, Tollywood, movies, Entertainment

With the announcement of the latest Champion of Change award, it was announced that this prestigious title is going to be awarded to Allu Arvind for his impeccable contributions to the telugu and the overall Indian movie industry.

అల్లువారింట క్రాంతి నింపిన సంక్రాంతి.. అరవింద్ కు అవార్డు..

Posted: 01/17/2020 09:43 PM IST
Famous telugu producer allu arvind to receive champion of change award

అల వైకుంఠపురంలో ప్రివ్యూ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ఆ వేడుకకు వచ్చిన ప్రేక్షకుల సాక్షిగా.. టీవీలలో చూస్తున్న వీక్షకుల సాక్షిగా తన కుమారుడు, సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రికి ప్రభుత్వం ఒక అవార్డును ఇస్తే బాగుంటుందని అడిగాడో లేదో.. అలా ఓ ప్రతిష్టాత్మక అవార్డు అల్లు అరవింద్ ఖాతాలోకి వచ్చి చేరనుంది. టాలీవుడ్‌ చిత్రపరిశ్రమకు యనలేని కృషి సల్పిన అల్లు అరవింద్ కు తమ ప్రతిష్టాత్మక ‘‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019’’ అవార్డుకు అందించనున్నట్లు అవార్డు సంస్థ ప్రకటించింది.

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల కమీషన్ మాజీ చైర్మెన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జ్ఞాన్ సుధా మిశ్రాలతో పాటు పలువురు ప్రముఖలు ‘‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019’’ అవార్డు కమిటీకీ జ్యూరీగా వ్యవహరిస్తున్న ఇంటరాక్టివ్ ఫారమ్ ఇండియన్ ఎకానమీ ఆధ్వర్యంలో ఈ అవార్డుల నిర్వహణ కార్యక్రమం జరగనుంది.

ప్రతిష్ట్మాతక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న బిరుదాంకితుడు ప్రణబ్ ముఖర్జీ అవార్డు గ్రహీతలకు అవార్డునిచ్చి సత్కరించనున్నారు. ఈ నెల 20న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఈ అవార్డును ఇన్నాళ్లు రాజకీయ, క్రీడారంగంలోని ప్రముఖలకు అందించిన సంస్థ ఈ సారి చిత్రరంగానికి చెందిన అల్లు అరవింద్ ను కూడా ఎంచుకుని సత్కరించడం ముదావహం.

తెలుగు చిత్రపరిశ్రమకు పాటుపడి టాలీవుడ్ లో అగ్రనిర్మాతలలో ఒకరిగా నిలబడ్డారు అల్లు అరవింద్. తెలుగుతో పాటు దక్షిణాది బాషల్లో కూడా పలు చిత్రాలను నిర్మించారు. దక్షిణ భారతంతో పాటు అటు బాలీవుడ్ లోనూ పలు చిత్రాలను నిర్మించి దేశవ్యాప్తంగా వున్న సినీ అభిమానులకు తన సేవలను అందించారు. ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్ నేపథ్యంలో మారిపోయే ప్రేక్షకుల అభిరుచి మేరకు చిత్రాలను నిర్మించిన ఆయన ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డును ప్రదానం చేయడం ప్రశంసనీయం.

తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మళయాలంతో పాటు పలు బాషలలో చిత్రాలను నిర్మించారు అల్లు అరవింద్. అంతేకాదు తాను నిర్మించిన చిత్రాలు అనేకం ప్రేక్షకుల మనన్నలు పోంది సూపర్ డూపర్ హిట్ల్ లుగా బాక్సాఫీసును షేక్ చేశాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్, అనీల్ కపూర్, గోవిందా, అమీర్ ఖాన్, పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ సహా పలువురు హీరోలతో ఆయన చిత్రాలను నిర్మించి విజయాలను అందుకున్నారు.

ఈ క్రమంలో సుమారు నాలుగు దశాబ్దాలుగా అల్లు అరవింద్ సినీపరిశ్రమకు చేస్తున్న సేవలను పర్యవేక్షించిన అవార్డు కమిటీ ఆయనకు అవార్డునిచ్చి సత్కారించనుంది. అల్లు అరవింద్ తో పాటుగా జార్ఖండ్ ఎన్నికలలో తనదైన ముద్ర వేసుకున్న జార్ఖండ్ ముక్తి మోర్చ అధినేత, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు కూడా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గాలైన డుమ్కా, బార్హైత్ అసెంబ్లీ సెగ్మెంట్లలో చేసిన కృషికి ఆయనను అవార్డు కమిటీ సత్కరించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles