Prabhas fans finally erupt in joy ప్రభాస్ అభిమానులకు సంబరం.. ‘జాన్’ నుంచి స్టిల్

Prabhas resumes shooting for jaan with pooja hegde

Prabhas, Jaan, Pooja Hegde, Jaan shooting, Radha Krishna, romantic movie, still from jaan, Radha Krishna Kumar, Jaan shooting Hyderabad, tollywood, movies, Entertainment

Prabhas's fame rose sky-high when he scored a hit with SS Rajamouli's Baahubali. His next film, Saaho, which was made on a massive budget of nearly Rs 300 crore, failed to rake in profits at the box office.

ప్రభాస్ అభిమానులకు సంబరం.. ‘జాన్’ నుంచి స్టిల్

Posted: 01/17/2020 07:53 PM IST
Prabhas resumes shooting for jaan with pooja hegde

బాహుబలి చిత్రాల హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత వచ్చిన సాహో చిత్రంతో ఫర్వాలేదు అనిపించాడు. అయితే తాజాగా ఆయన అటు చారిత్రాత్మక చిత్రాలకు, ఇటు యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లకుండా మిస్టర్ ఫర్ ఫెక్ట్ రేంజ్ లో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తోంది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అయితే అభిమానులను సంతోషపర్చేందుకు.. ముందుగా చెప్పినట్టుగానే ఈ రోజున సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఒక అప్ డేట్ వదిలాడు. ఈ సినిమాకి సంబంధించిన ఒక స్టిల్ ను ఆయన రిలీజ్ చేశాడు. విలాసవంతమైన ఒక భవనంలోకి అడుగుపెట్టిన ఆయన, అక్కడి పరిసరాలను చూస్తూ ఏదో గుర్తు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాడు. డిఫరెంట్ లుక్ లో ప్రభాస్ కనిపించనున్నాడనే విషయం మాత్రం అర్థమవుతోంది. పునర్జన్మలతో ముడిపడిన ఈ కథ .. యూరప్ నేపథ్యంలో రూపొందుతోంది. కాగా మొత్తానికి చిత్రం నుంచి అప్ డేట్ లభించడంతో ప్రభాస్ అభిమానులు సంబరపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles